అన్నదాత మొగ్గలు

అన్నదాత మొగ్గలు
అన్నదాత మొగ్గలు

తొలకరిజల్లుల చినుకులు 
ఇలపై కురిస్తేనే
రైతన్న జీవం పోసుకుని 
నాగలితో జోడి కడతాడు

ధరణిలో విత్తులను 
మొలకెత్తించేది అన్నదాతలు
పంటపండించడానికి 
తన సత్తువంతా ధారపోస్తూ
అనునిత్యం శ్రమను నమ్మి 
స్వేదం చిందే మహాయోగి

పంటతో సమస్తమానవాళి 
ఆకలితీర్చేది అన్నదాతలు
ప్రతిదినం పంటల్ని
 కంటికి రెప్పలా కాపాడుతూనే  
రైతు పంటలకు వెలుగుచీకటై
ప్రాణాలను పోస్తడు

సమాజానికి పంటల నిధితో ఆసరా అన్నదాతలు
నేలతల్లి ఎన్నో ఆటుపోట్లను తట్టుకుంటూ
రైతు సాగుచేసే పంటలకు 
దయాదాక్షిణ్యాలనిస్తుంది
దేశానికి పసిడిపంటలనిచ్చే 
అన్నపూర్ణ అన్నదాతలు
ప్రతి మనిషికీ మెతుకులు పంచే
ఆపన్నహస్తమవుతూ
జగమంతటికీ ప్రాణాధారమైన ధాన్యాగారం 
రైతు దేశానికి వెన్నెముకై తోడుండే రారాజు అన్నదాతలు

...............................................................................................

అన్నదాత మొగ్గలు
కొలిపాక శ్రీనివాస్
     సింగరాజుపల్లి, దామెర,
వరంగల్ రూరల్. 
98665 14972