మళ్ళీ విత్తనంలోకి..

మళ్ళీ విత్తనంలోకి.._harshanews.com
మళ్ళీ విత్తనంలోకి.. 

అంతా చీకటే,
లోకమంతా నిత్యం సూర్యోదయం
అనునిత్యం చంద్రోదయం_అనుసృతమైన ఈ బంధం
సత్యమై నా,హృదయాంతరలలో ఏదో అంధకారం

నూతన తేజస్సు తో ఉషస్సు తో ఉదయించలన్న ఆశ
మరోసారి, మరోసారి_మళ్ళీ మళ్ళీ చైతన్యం చేస్తున్నా
నీ వికటాట్టహాస దుశ్చెట్ట లు_నన్ను విగతున్ని చేశాయి

నీ కొర్కెలపల్లకిలో ఊరే గడం కోసం ఎంచేశావో
నీ మట్టి నడుగు, నువ్వేసిన అడుగు నడుగు
గ్లోబల్ లో నీ ఐడెంటిటీ కోసం చేసిన
పరి శో ధనల్ని చూడు_కూడు,
గుడ్డ నీ కనీస అవసరం అన్ననాడు
నేను హరితాన్ని, నేనో వనాన్ని, నేనో కొండను,నేనే
శిఖరాన్నినేనో విశాల జగత్తునునేనో అన్నపూ ర్ణను
నీ చెమట చుక్కల్ని, మబ్బుల్ని,
పొలిమేలోని చెరువులను, వాగుల్ని_
నా ఆసరాగా, నాలో నిత్యం
కల్పతరువు లే _ నేనో కామధేనువు నే_నీ నిర్లక్ష్యం
నీడలో_ నన్ను నమ్మి సాగు చేసిన వాడికి
నేనో ఉరికొయ్యనయ్య_
నేనో బతుకులే ని బాటసారి నయ్య

నా ఊహల రెక్కల్ని కూడా
నీ కలి వ్యవహారంతో
నిల్వునా కత్తిరించిన వేళా,
నేనొక నిర్జీవ జగత్తును ;
కానీ నీకు తెలుసా!

నీ ముంగిట మురిసే ముత్యపు అంకురా న్ని
ముప్పొద్దులా నిన్ను మేపే బువ్వను
నీ ఊపిరి నిచ్చే ఆక్సిజెన్ ను
నీ మనుగడ సాకారాన్ని
నన్ను మర్చిన ఓ నేస్తమా

నీలో నీవు అంకురించు
మళ్ళీ విత్తనం లోకి నిన్ను స్వాగతిస్తున్న
పౌష్టి కంగా అంకురించూ,
భూతల్లి స్పర్శ తో,చినుకమ్మ ఆదరణ తో
మొలకెత్తే విత్తనాన్ని,
నీ ఆహారాన్ని,నీ ఆక్సీజనను,నీ జ్ఞానాన్ని
మిత్రమా! మళ్ళీ విత్తనం లోకి రా
స్వచ్చంగా,స్వతంత్రంగా పౌష్టికంగా
రేపటి నీ ఉజ్వల భవిత కోసం..
...........................................................................................

మళ్ళీ విత్తనంలోకి.._harshanews.com
డాక్టర్ బండారు సుజాతశేఖర్ 
 హైదరాబాద్​
 98664 26640