"శృతి-లయ"

 "శృతి-లయ"_harshanews.com
 "శృతి-లయ" శృతి నీవు..గతి నీవు..
ఈ నా కృతి నీవు
 భారతీ!! 

శృతి-లయలు ముద్దులొలికే కమల పిల్లలు. జీవితంలో శృతి సుధ్ధమైన రాగాలతో,లయ బధ్ధమైన అడుగులు నేర్పిస్తూ,సాధన చేయాలి.

నేటి యుగంలో ఈ రెండింటికి స్థానం లేదనిపిస్తోంది.శృతి లేని భావనలు,నిబద్ధత లేని అడుగులు వేస్తున్నారు.జీవితంలోని ప్రతి మలుపు ఒక పరీక్షే ..ఆ కష్టాన్ని ఎదిరించి ముందడుగు వేసిన రోజే మనం ఆనందంగా అనుభవిస్తాము.

"కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్ఛతి ధీమతామ్
వ్యసనేన చ మూర్ఖాణాం నిద్రాయా,కలహేనవా"
యోగ్యులు తమ సమయాన్ని శృతి ముద్ర సాధనలో వుంటారు మరి మూర్ఖులు అపశృతులకు నాంది పలుకుతూ నిద్ర సాధనలో వుంటారు.

నేటి సమాజంలో శృతికి మారు పేరు అహంకారం లయకి మారు పేరు జల్సాలు.నెమలికి నేర్పిన నడకల పోలికతో  ఆస్తిపరుల అహంకారానితో జతకట్టి    అడుగులు నేర్పేది జల్సమ్మే.పని ఉంటేనే పలకరింపు,లేదంటే చీదరింపు.అవసరం ఉంటేనే అభిమాన వర్షం,అవసరం తీరాక తగలేసే రకం.ఇదే నేటి కాలం తీరు.

కోకిలమ్మ రాగాలకు నెమిలమ్మ అడుగులు ఆదర్శం.ప్రకృతిని ఆరాధిస్తే జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడం, శృతి సుద్ధంగా లయ బద్ధంగా ఆలోచించి అడుగులు వేస్తే బంగారు బాట మనదే కదా!!

రాగం...తానం...పల్లవి...
నా మదిలోనె  కదలాడే...
శృతిలయల అలజడి..

....................................................................................................
          -
 "శృతి-లయ"_harshanews.com
నాట్యమయూరి టి.వి శిరీష,
హైదరాబాద్​.
96184 94909