సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన

సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన_harshanews.com
సిబ్బందికి వివరిస్తున్న రాచకొండ సీపీ మహేష్ భగవత్​


  • పోలీస్ రిసెప్షన్, వెర్టికల్ మీటింగ్ ట్రైనింగ్ ప్రారంభం
  • పాల్గొన్న రాచకొండ కమిషనర్​ మహేష్​ భగవత్​, అదనపు డీసీపీ అడ్మిన్​ శిల్పవల్లి


హైదరాబాద్​: సాంకేతిక పరిజ్ఞానంపై పోలీస్​ సిబ్బందికి అవగాహన కల్పించేందుకు  పోలీస్ రిసెప్షన్, వెర్టికల్ మీటింగ్ ట్రైనింగ్ ను బుధవారం రాచకొండ కమిషరేట్​లో ప్రారంభమైంది. కమిషనర్​ మహేష్​భగవత్​, అదనపు డీసీపీ అడ్మిన్​ కె. శిల్పవల్లిలు పాల్గొని ట్రైనింగ్​కు సంబంధించిన పలు సూచనలను సిబ్బందికి సూచించారు. ఈ ప్రోగ్రాంలో రెసెప్షన్ ఆఫీసరుల పాత్ర, దాని ప్రాధాన్యత, లక్షణాలు, సామర్థ్యాలు, విధులు వారి బాధ్యతలు పెంపొందించుటానికి సాంకేతిక పరిజ్ఞానముపై అవగాహణ కల్పించారు. అలాగే Covid-19 నివారణ చర్యలు, థర్మల్ పల్స్ ఆక్సిమీటర్ వాడకం, మరియు వ్యక్తులు ఆరోగ్య DSR ఆన్‌లైన్ సబ్మిషన్ పై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వర్టికల్ ఇంచార్జ్ కీసర పోలీస్టేషన్ సీఐ నరేందర్ గౌడ్, ఎఫ్ సి సి కో-ఆర్డినేటర్ సైదయ్య, ఇన్స్పెక్టర్, శ్రీ. రామన్ గౌడ్, ఎస్ ఐ పి,  డబ్ల్యూ పిసి స్నేహ సంద్య సి సి ఆర్ బి,  కమిషరేట్​ పరిధిలోని 44 పోలీసు స్టేషన్ ల నుండి రెసెప్షన్ ఇంచార్జ్ ఆఫీసర్లు  హాజరయ్యారు.