అమ్మ .. కనిపించే దైవం!

అమ్మ .. కనిపించే దైవం!
Image by RENE RAUSCHENBERGER from Pixabay 

మన మౌనం లో
దాగి ఉన్న కోరికలను
మనస్ఫూర్తిగా
తీర్చిన మాతృమూర్తి!

మనం వేసే
ప్రతి అడుగుకు
తొలిమెట్టుగా నిలిచి
తోడుగా
నడిచిన కరుణామూర్తి!

మనలోని
నిరాశా నిస్పృహలను
పారద్రోలి
ధైర్యాన్ని విశ్వాసాన్ని
నింపిన చైతన్య మూర్తి!

కులమతాలకు
అతీతమైన
భావాలను నింపి
భారతీయతను
పెంచిన ఆదర్శ మూర్తి!

మనలోని బాధలకు
బాసటగా నిలిచి
నవ్వుల విశ్వంలోకి
తీసుకెల్లిన ప్రేమమూర్తి!

మనలోని
ఆవేశాన్నీ కోపాన్నీ
అణిచివేసి
వివేకాన్ని,విజ్ణానాన్ని
నింపిన అహింసా మూర్తి !

మనలోని ఒంటరితనాన్ని
రూపుమాపి
నేనున్నానంటూ
ఓదార్చిన అమృతామూర్తి!

మనలోన నైతిక సామాజిక
విలువలను పెంచి
భారతీయ రత్నాలుగా
తీర్చిదిద్దిన విప్లవమూర్తి!

మనలోని స్వార్థాన్ని
ద్వేషాన్ని పక్కకు తోసి
అను బంధాలను పెంచిన
ఆత్మీయతామూర్తి!
అందుకే .. '
అమ్మ' కనిపించే 'దైవం' ...!!!
..............................................................................


అమ్మ .. కనిపించే దైవం!
సునీత బండారు.
మహబూబ్​నగర్​,
94406 71530