వర్షాకాలంలో అప్రమత్తత అవసరం

వర్షాకాలంలో అప్రమత్తత అవసరం_harshanews.com
వర్షాకాలంలో అప్రమత్తత అవసరం 


  • జాగ్రత్తగా ఉంటే సీజనల్​ వ్యాధులు దరిచేరవు
  • ఆరోగ్యంగా శ్రద్ధ తీసుకోవాలి
  • అపోలో హాస్పిటల్​ వైద్యులు డా. అప్లాజ్ అహ్మద్ 
  • ప్రజలకు పలు సూచనలువర్షాకాలంలో అప్రమత్తత అవసరం_harshanews.com
Dr.Aftab Ahmed
Senior Consultant physician,
Apollo Hospitals, Secunderabad.
 వర్షాకాలంలో సీజనల్​ వ్యాధులు మన దరి చేరకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని సికింద్రాబాద్​అపోలో హాస్పిటల్​సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డా. అప్లాజ్ అహ్మద్ తెలిపారు. రానున్న వర్షాకాలంలో సీజనల్​ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పలు సూచనలు చేశారు. 

దోమల వలన సంక్రమించే వ్యాధులు : 

వర్షాకాలం అంటేనే చిన్న చిన్న కుంటలు ఏర్పడి వాటిలో నీరు చేరి నిల్వ ఉంటుంది. ఈ నీటిలో దోమలు తమ సంతానోత్పత్తిని విరివిగా పెంచుకునేందుకు వాటికి అదొక అనుకూలమైన ప్రదేశం. మలేరియా, ఫైలేరియల్, డెంగ్యూ మరియు చికున్ గున్యా వంటి జ్వర సంబంధిత అనారోగ్యాలు ఎక్కువ సంఖ్యలో ఏర్పడడానికి ఇదే కారణం అవుతుంది. ప్రతి సంవత్సరం మన వద్ద చాలా ఎక్కువ మంది ఇటువంటి అనారోగ్యాల బారిన పడుతుంటారు. మలేరియాకు నిర్దిష్టమైన చికిత్స అనేది ఉండగా, డెంగ్యూ మరియు చికున్ గున్యా వంటి వాటికి లక్షణాల ఆధారంగా చికిత్సను అందించడం జరుగుతుంది. సరైన సంరక్షణ తీసుకోకపోవడం మరియు చికిత్సలో ఆలస్యం జరగడం వలన కొన్నిసార్లు అది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. దురదృష్టవశాత్తు, ఈ వ్యాధులకు వ్యాక్సిన్ అందుబాటులో లేనందున నివారణే ముఖ్యమైన చర్యగా పరిగణించాలి. దోమ కాటు నుండి ఎలా రక్షణ పొందవచ్చు.

ఎ) దోమ తెరలను వాడడం అదేవిధంగా కిటికీలు మరియు తలుపులకు మెట్లను ఏర్పాటు చేసుకోవడం బి) మస్కిటో రిపెల్లెంట్లు మరియు కాయిల్స్ ను ఉపయోగించడం సి) పొడగాటి చేతులు ఉన్న షర్టర్లను మరియు ఫుల్ బ్రౌజర్లను ధరించడం డి) నీటి నిల్వ ఉండే ప్రాంతాలను సమూలంగా నిర్మూలించడం ఇ) నీటి పాత్రలన్నింటిపైనా మూతలను ఏర్పాటు చేయడం ఎఫ్) పాతబడిన టైర్లు మరియు డ్రమ్ములలోని నీటి నిల్వను ఖాళీ చేయడంజి) డ్రెయిన్లన్నింటిలో నీరు సక్రమంగా పారే విధంగా చూడడం 

నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు : 

మనం తినే ఆహారం మరియు తాగే నీరు కలుషితం కావడం వలన వైరల్ హెవీటైటిస్ ఎ, కలరా, టైఫాయిడ్ మరియు గ్యాస్ట్రోఎంటిరిటిస్ వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు కూడా వర్షాకాలంలో అధికంగా నమోదు అవుతుంటాయి. అవి జ్వరం, విరేచనాలు లేదా కామెర్లుగా బహిర్గతం అవుతుంటాయి.

నివారించే చిట్కాలు :

ఎ) ఆహారం వండే ముందు మరియు తరువాత అదేవిధంగా తినే ముందు చేతులను శుభ్రంగా సబ్బుతో కడగాలి బి) వండే ముందు ఆహార పదార్థాలను పరిశుభ్రమైన నీటితో కడగాలి సి) సరైన రీతిలో మరిగించి, వడపోసిన నీటిని లేదా బాటిల్ నీటినే తాగాలి డి) అపరిశుభ్రంగా ఉండే స్ట్రీట్ ఫుడ్ ను మానివేయాలిఇ) హెపటైటిస్ ఎ మరియు టైఫాయిడ్ కు టీకాలు అందుబాటులో ఉన్నాయి 

ఫంగల్ ఇన్ఫెక్షన్లు: 

తడి మరియు తేమతో కూడిన వాతావరణం వలన చర్మంపై, మరీ ముఖ్యంగా పాదాలకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందేందుకు ఎక్కువ అవకాశం ఉ ంటుంది. కాలి వేలి గోళ్లు పెరిగినట్లయితే వాటిని కత్తరించాలి, సాధ్యమైనంతవరకు మురికి నీటిలో నడవకుండా చూసుకోవాలి ఒకవేళ నడిచినట్లయితే పాదాలను బాగా శుభ్రంగా కడగాలి.

శ్వాసకోశ వ్యాధులు మరియు కోవిడ్-19 : 

వాతావరణంలో మార్పు రావడం వలన అది ఆస్తమా మరియు సైనస్ సమస్యలకు దారితీస్తుంది. కోవిడ్-19కి సంబంధించినంతవరకు అయితే భారతదేశంలో ఉష్ణోగ్రత మరియు గాలిలో తేమ ఏ మేరకు వైరస్ వ్యాప్తిని ప్రభావితం చేస్తుందో ఇప్పటికి ఇతమిద్దంగా తెలియదు మరియు దానిని ఊహించడానికి కూడా వీలు లేదు. వేసవిలో వైరస్ వ్యాప్తి సంఖ్యలో తగ్గుదల ఏమి కనపడలేదు. అదేవిధంగా వర్షాకాలంలో వైరస్ వ్యాప్తి పెరగడమో లేదా తగ్గడమో అనేది మనం చూడవచ్చేమో. వరదలు వంటివి సంభవించినట్లయితే, ప్రజల సామాజికంగా దగ్గర కావడం లేదా వారు సహాయక శిబిరాల్లో చేరినట్లయితే అక్కడ కిక్కిరిసి పోవడం వంటి పరిస్థితులు వైరస్ వ్యాధి వ్యాప్తి పై ప్రభావం చూపవచ్చు.