వ్యక్తిగత శుభ్రత పాటించాలి


  • సర్పంచ్​ బుడ్డ స్వర్ణలతా భాగ్యరాజ్​
  • ప్రతిమ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో మాస్క్​ల పంపిణీ


వ్యక్తిగత శుభ్రత పాటించాలి_harshanews.com
మాస్క్​లను అందజేస్తున్న సర్పంచ్​, ఏఎన్​ఎంలు

వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తేనే ఎలాంటి వైరస్​లు దరిచేరవని చందాయిపేట సర్పంచ్​ బుడ్డ స్వర్ణలతాభాగ్యరాజ్​ ప్రజలకు సూచించారు. చేగుంట మండలంలోని చందాయిపేటలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిమ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు మాస్క్​లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసరాల్లో చెత్తచెదారం ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వ్యక్తిగత దూరం పాటించాలని చెప్పారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న వైద్య సిబ్బందిని ప్రశంసించారు. మాస్క్​లను అందజేసిన ప్రతిమ ఫౌండేషన్​ ప్రతినిధులను అభినందించారు.  ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంతోష్ కుమార్, ఏఎన్​ఎంలు అనురాధ, నవనీత, వార్డ్ సభ్యులు రమ్య, సాయిబాబా, వెంకటేష్, ఆశా వర్కర్లు అరుణ, లలిత, గ్రామస్తులు పాల్గొన్నారు.