మనసొక మధుకలశం

మనసొక  మధుకలశం_harshanews.com
Image by Bingo Naranjo from Pixabay 

విరబూసే వెన్నలలో
నీ చల్లని దరహాసాలను చూస్తున్న..

భానుని కిరణాలలో ..
నీ కనుల వెలుగు లే కనుగొన్నా..
మెరిసే నక్షత్రాలలో
నీ బుగ్గలపై తారాడే జిగిబిగి సిగ్గు లే వీక్షించా..
ఎలకోయిల గీతాల లో నీ స్వరాలాపనలే వినుచున్నా..
విరిసే సుమాల లో నీ.. భావనల నే నందుకున్నా ..
నీ మురిపాల.. మాటల స్వరాల లో ముత్యాలనేరుతున్నా..
నా కనుగవలో నీ నిండు రూపాన్నే నే దాచుకున్నా..
కురిసే చినుకులలో నీ ప్రేమ మదురిమ లలో తడుస్తున్నా..
వీచే గాలులలో నీ శ్వాశలలో నే మమైక్య మవుతున్నా..
చిగురించే ఆమని లో నీ తలపుల తో తపిస్తున్నా..
కదిలే మేఘాల లో నీ ఊసులనే తలచుకున్నా..
మెదలే ఆలోచనలలో నిన్నే నింపుకున్నా...

నీ అడుగుల సవ్వడులలో
నా అదృష్ట జాడలనే వెతుకుతున్నా...
ఏకాంత దారులలో
నీ తోడునే కోరుకున్నా..
రాలుతున్న పూలలో
నీ జ్ఞాపకాలనే ఏరుతున్నా...
కరుగుతున్న కాలాన
నీ రూపాన్నే మిగుల్చుకున్నా..
నా మనసొక మధు కలశం కాగా ..
నీకై ప్రేమ మధువులను నింపుకున్నా చెలీ..
....................................................................................................

మనసొక  మధుకలశం_harshanews.com
పోపూరి మాధవీలత
హైదరాబాద్