మానవాళికి ‘యోగా’ గొప్ప కానుక

మానవాళికి ‘యోగా’ గొప్ప కానుక
Image by Okan Caliskan from Pixabay 

 
భారతీయ సంస్కృతి లో భాగం యోగ. యోగ ప్రాచీనమై న నిత్య నూతనంగా ఉంటుంది.విశ్వ మానవాళికి భారత దేశం అందించిన గొప్ప కానుక యోగ. పరిపూర్ణ ఆరోగ్యమే యోగ ప్రధాన లక్ష్యం.యోగ అనగానే పతంజలి మహర్షి గుర్తుకొస్తారు ఆయన బోధిం చిన  అష్టాంగ యోగమే అన్ని యోగ విధానాలకు మూలమనడం లో సందేహం లేదు.

కాలానుగుణం గా యోగ లో ఎన్నో మార్పులు వచ్చాయి.యోగ వ్యాయమం ఎంత మాత్రం కాదు అదే విధంగా  మతా నికి సంబంధం లేదు.ఎవరైనా ఎక్కడున్నా,జాతి, మత, కుల, ప్రాంత, భాషా సాంసృతిక భేదాలకు అతీతంగా అందరూ ఆచరించవచ్చు.  భారత్ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం ను జరపమని ఐక్యరాజ్య సమితి వేదికపై 2014,సెప్టెంబర్ 27న 69 వ సమితి సమావేశంలో పిలుపునిచ్చారు. యోగ ప్రాధాన్యతను ప్రస్తా వించారు. ఆ విధంగా ప్రపంచ దృష్టి కి తీసుకొచ్చారు. ఇది జరిగిన 75 వ రోజున డిసెంబర్ 11 న సభ్య దేశాలలో 177దేశాలు ఏకగ్రీ వ తీర్మానంలో ప్రతి ఏటా జూన్ 2 1న అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని నిర్వహించేందుకు అంగీకరించారు. భారత గడ్డ పై ఆవిర్భవించిన యోగ మార్గం విశ్వ మానవాళికి మార్గదర్శి కావడం భారతీయులందరికీ గర్వ కారణం.

యోగం అనే శబ్దం ' యుజ్ ' అనే సంస్కృ త ధాతువు నుండి పుట్టుకొచ్చింది. దీని అర్ధం కలయి క, ఐక్యం, జత  చెయ్యడం . శరీరాన్ని, మనసును కలపడమే యోగ. శరీరాన్ని మనసును రెండింటినీ  సమతౌల్యంలోకి తెచ్చేది యోగ. యోగ మానసిక, శారీరక ఆరోగ్యాలు రెండింటికీ సమానమైన ప్రాధాన్యమిస్తోంది.యోగలో ఆసనాలు అత్యంత కీలకమైనవి. శరీర సామర్ధ్యాన్ని పెంచడంలో, మానసిక ప్రశాంతత చేకూర్చడంలో యోగకి మించింది మరొకటి లేకపోవడమే అంతర్జాతీయ గుర్తింపునకు ఆదరణకు నోచుకోని చివరకు అంతర్జాతీయ యోగ దినోత్సవం జరుపుకునే స్థాయికి చేరుకుంది.

ఆరోగ్యమే మహా భాగ్యం. ఆ భాగ్యాన్నీ పొందడం కోసం యోగను ఆచరించడం చాలా అవసరం. ఆందోళన పోవాలన్న, బద్దకం, సోమరితనం తొలగిపోవాలన్న, నిత్య నూతనంగా కనపడాలన్నా, చురుకుదనంతో ఉండాలన్నా యోగ ను ఆశ్రయించక తప్పదు. మనసులోని ఆలోచనలను అదుపులో పెట్టడానికి, సానుకూల ఆలోచనలకు యోగ ఎంతగానో ఉపకరిస్తుంది. యోగా, ప్రాణాయామం మరియు ధ్యానం చేస్తున్న వారి మానసిక స్థితిలో, ఆలోచనలలో సానుకూలమైన మార్పు కనిపించినట్లు హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఆధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

యోగ అనగానే కష్టమైనదిగా భావిస్తారు. యోగా సులభమైనది. ఆసనాలు ఒక్కసారి నేర్చుకుంటే చాలు ఎవరికీ వారు ఎవరి సహాయం లేకుండా చేసుకోవచ్చు. పద్దతి ప్రకారం క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.  నిండు నూరేళ్ళు బతక వలసిన జీవితం రోగాల బారిన   పడటం, తద్వార  అకాల మరణం చెందడం జరుగుతుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడ యోగా వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని ధృవీకరిస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. యోగాను దైనందిన జీవితంలో వినియోగించుకోవడం ద్వారా మధుమేహం, క్యాన్సర్, గుండె సంబంధ వ్యాధులవంటి  అసాంక్రామిక వ్యాధులను అదుపులో పెట్టవచ్చని విజ్ఞులు తెలియజేస్తున్నారు. భారతదేశంలో ఇటువంటి వ్యాధుల వల్ల 60శాతం మరణాలు
సంభవిస్తున్నాయని, వీటిని నియంత్రించకుంటే 2030 నాటికి భారత దేశం4.58 లక్షల కోట్ల డాలర్ల నష్టాలను చవి చూడవలసిన పరిస్థితి వస్తుందని కొన్ని ఆధ్యయనాలని ఉదహరిస్తూ  ప్రధాని  చేసిన ప్రకటనలో నిజం లేకపోలేదు. సంఘర్షణలను తట్టుకొనే శక్తి యోగా కలిగిస్తుంది. మానసిక ఒత్తిడి నుండి బయట పడే అవకాశం యోగ కల్పిస్తుంది. వ్యసనాల బారిన పడి జీవచ్ఛవాలుగా ఉన్నవారికి ఊపిరినిస్తుంది. నూతన జీవితానికి అంకురార్పణ చేస్తుంది. 

ఆధునిక జీవన శైలి వల్ల కలిగే రుగ్మతలను నిర్మూలిస్తుంది. హాయి హాయిగా నిద్ర పోవడానికి, తిన్నది పూర్తి గా జీర్ణం కావడానికి, వెన్నునొప్పిపోవడానికి, తలనొప్పి తగ్గడానికి, అధిక రక్తపోటును అదుపులో పెట్టడానికి, ఎసిడిటీ సమస్య నుండి బయటపడటానికి, దృష్టి దోషాలు, గుండె జబ్బులు లేకపోవడానికి, ఎముకల దృఢత్వా నికి యోగ ఎంతగానో ఉపకరిస్తుంది. మనో వికాసానికి యోగ  దోహద పడుతుంది. శరీరం రోగాల పుట్టగా ఉండకుండా, రోగ నిరోధక శక్తి పెరగడానికి యోగ మేలు చేస్తుందని వివిధ పరిశోదనలు వెల్లడిస్తున్నాయి. ఒత్తిడి లేని జీవితంతో, హాయిగా ఉండటానికి, సంతోషంగా జీవించడానికి ' యోగా' దుష్పలితాలు లేని మందుగా పనిచేస్తుంది.  

అంతర్జాతీయ స్థాయి పొందిన యోగాను విధిగా విద్యా సంస్థలలో బోధించాలి. యోగాలో పరిశోధ నలకు ప్రాధాన్యత నివ్వాలి. యోగాలో సుక్షితులైన  వారికి  ప్రోత్సహకాలు ఇవ్వాలి. మానవాళికి అవసరమైనది కావటం వల్లే యోగా విశ్వ వ్యాప్తం అయ్యింది.


యోగ మార్గాన్ని అనుసరిస్తే ఆరోగ్య యోగం కలిగినట్టే. ఆనంద యోగం సిద్ధించినట్టే. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యోగాకే పెద్ద పీట వేయాలి. ప్రజలకు యోగా చేయడం వలన కలిగే ప్రయోజనాలను తెలియజేయాలని ఆశిద్దాం.

        
మానవాళికి ‘యోగా’ గొప్ప కానుక

ఆచార్య గిడ్డి వెంకట రమణ
సామాజిక శాస్త్ర ఆచార్యులు &
డీన్ విద్యార్ధి మరియు ప్రజా వ్యవహారాలు
శ్రీ కృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం 
అనంతపురం.
94409 84416

Post a Comment

0 Comments