సహజపండిత మొగ్గలు

సహజపండిత మొగ్గలు_harshanews.com
సహజపండిత మొగ్గలు 

సహజ పాండిత్య శోభతో అలరారుతూ 
పండిత పామరులను సైతం అలరించారు
తెలుగు వెలుగు నలుదిశల ప్రసరింప చేశారు 

అలతి అలతి పదాలతో రచన గుప్పిస్తూ 
రస రమ్య కావ్యాలను రచించారు 
కవిత్వంలో సహజత్వం చూపించారు 

హలము పట్టి పొలము దున్నుతూ 
కలము పట్టి పలురచనలు చేసారు 
కావ్య కన్యకను శ్రీరామునికే  అకింతమిచ్చారు.  

సాహిత్యంలో నవరసాలు పండిస్తూ 
నవవిధ భక్తి మార్గాల రసఝరులు కురిపించారు 
రామభక్తిని భక్తి తత్వంలో చెప్పకనే చెప్పారు. 

తియ్యనైన తేట తెలుగులో రచనలు చేస్తూ 
తేట తెలుగు భాషకు ఎనలేని కీర్తి ఆర్జించి పెట్టారు 
సహజ పండితుడని బిరుదు గడించారు.
.......................................................................................... 

సహజపండిత మొగ్గలు_harshanews.com
 కె. శైలజా శ్రీనివాస్
విజయవాడ.
80197 36254