పంపిణీదారులు, భాగస్వాములకు ఎయిర్‌టెల్ సాయం


  • 30 వేల మంది డీలర్లు, డిస్ట్రిబ్యూషన్ భాగస్వాముల ఉద్యోగులకు మే నెల జీతాలు
  • భారతి ఎయిర్‌టెల్‌ ఏపీ, తెలంగాణ సీఈవో అవనీత్ సింగ్ పూరి

పంపిణీదారులు, భాగస్వాములకు ఎయిర్‌టెల్ సాయం_harshanews.com
పంపిణీదారులు, భాగస్వాములకు ఎయిర్‌టెల్ సాయం

పంపిణీదారులు, భాగస్వాములను ఆదుకునేందుకు మే నెల జీతాలు అందజేస్తున్నట్లు భారతి ఎయిర్​టెల్​ ఏపీ, తెలంగాణ సీఈవో అవనీత్​సింగ్​ పూరి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్​కారణంగా దేశంలో వ్యాపార సంస్థలన్నీ కుదేలయ్యాయని తెలిపారు. అయితే సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ తమ భాగస్వాములను,  రిటైల్ ఫ్రాంచైజీదారులను ఆదుకునేందుకు ఎయిర్‌టెల్ చేయూతనందించనున్నట్లు తెలిపారు. టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ తన రిటైల్ మరియు డిస్ట్రిబ్యూషన్ భాగస్వాములచే నియమించబడిన దాదాపు 30,000 మంది సిబ్బందికి మే జీతాలు చెల్లించాలని నిర్ణయించింది, ఈ నెలలో కరోనా కారణంగా  ఏర్పడిన కష్టాలకి సహాయంగా ఎయిర్టెల్ తమ భాగస్వాముల ఉద్యోగులను ఆదుకోవాలని నిర్ణయించుకుంది. ఏప్రిల్ నెలలో కూడా సంస్థ ఇదే విదంగా సహాయం చేసింది. మే 2020 వరకు ఎయిర్‌టెల్ 30,000 మంది భాగస్వాముల ఉద్యోగుల బేసిక్  జీతాలను చెల్లిస్తుందని, ఇది మే చివరి వరకు పొడిగించిన లాక్‌డౌన్ ప్రభావంపై ఉద్యోగులు, ఛానల్ భాగస్వాముల కుటుంబాలకు సహాయపడటానికి ఉద్దేశించిన చర్యని తెలిపారు.