కష్టజీవి

 కష్టజీవి
 కష్టజీవి

కుటుంబం కోసం నానా కష్టాలు పడుతూ
అత్యంత శ్రమకోర్చి
పిల్లల భవితకు
బంగారుబాట వేసేందుకు
మూలాధారమైన నాన్న కష్టజీవి

తను తిన్నా తినకున్నా
తన రక్తాన్ని పంచుకున్న
బిడ్డలకు కడుపునింపి
ప్రేమాభిమానాలను
పంచే అమ్మ కష్టజీవి

రేయనక పగలనక
కష్టపడి హలాన్ని పట్టి
పొలాన్ని దున్ని పంటలు
పండించి దేశంలోని
ప్రతిఒక్కరికి తినడానికి
తిండిపెట్టే అన్నదాతలు
అసలైన కష్టజీవులు

దేశరక్షణకై తమ ప్రాణాలను
సైతం త్రుణప్రాయంగా
భావించి తుపాకీ గుళ్ళకు
గుండెచూపి ధైర్యంగా
నిలబడి భరతమాత నుదుట
రక్తసిందూరం దిద్దే
సైనికులు కష్టజీవులు

రోగాలు రొష్టులు వచ్చినప్పుడు
తమ ఆరోగ్యాలను లెక్కచేయక
అందరికీ వైధ్యం చేసి
ప్రాణాలను కాపాడే
వైద్యులు, నర్సులు కష్టజీవులు

మనలోని అజ్ఞానాంధకారాన్ని
తొలగించి జ్ఞానమనే వెలుగును
మస్తిష్కంలో నింపి మంచిచెడు
నేర్పించి సమాజంలో మనకంటూ
ఒక గుర్తింపు తీసుకురావడానికి
నిరంతరం శ్రమించే
గురువులు కష్టజీవులు
...........................................................
 కష్టజీవి
సత్యనీలిమ,
వనపర్తి.
95021 56813