ఆకలికి భరోసా ఇవ్వాలి చేయూత


aakaliki barosa_harshanews.com
Image by Kasun Chamara from Pixabay 

పేదరికాన్ని పట్టిపీడించే
పెద్ద రాకాసి దశమదరిద్రమై
ఆకలిసింహాసనాన్ని అధిష్టించి
అంటువ్యాథిలా
విడదీయలేని అల్లికలల్లుతోంది

ఆకలే అసలు వైరస్సై
నిరుపేదలతో సహజీవనం
సాగిస్తుంటే చిన్నగీతలు,పెద్దగీతలంటూ
అసందర్భపు ప్రేలాపనలెందుకు?
నిండిన కడుపుకే వెండికంచాల
బహుమానాలెందుకు?
మృష్టాన్నభోజనాలెందుకు?...

పాలకులతోటో,పాలితులతోటో
వంతులెందుకు?
పోలికలెరగని ఏలికలా
ఆకలిడొక్కను అంటే
అన్నం మెతుకవుదాం
వారి కన్నీరు తుడిచే
చూపుడు వేలు అవుదాం...

ప్రకృతి శాపమో?
మానవత దారితప్పిన పెను ప్రమాదమో?
మీనమేషాలు లెక్కించక
మనమే జనంగా...
జనమే మనంగా....
చేయూతై సాగుదాం...
.......................................................................................................
aakaliki barosa_harshanews.com
  సోంపాక సీత
  భద్రాచలం
86393 11050