వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః_harshanews.com
వృక్షో రక్షతి రక్షితః

మొక్కలే కదాని
మొక్కుబడిగా
వ్యవహరించకండి

నర్సరీలలో ఉన్నవాటిని తెచ్చి
నడీబజారులో విసిరేసి
పసిప్రాణాల ఉసురు తీయకండి

పిరికెడుమట్టి
కాసింత జాగానివ్వండి

ఎదిగాకా ఒదిగిఉంటాయి
తోడూనీడై రక్షణనిస్తాయి
చిన్నకర్రను ఆసరగా ఇస్తే
వృద్ధాప్యంలో చేతికర్రనిచ్చి
ఋణంతీర్చుకుంటాయి

కాసిన్నినీటిని పోసి పెంచితే
వర్షాన్ని కానుకగా అందిస్తాయి
పసిడిపంటలకు జీవంపోసి
ప్రాణవాయువుతో ఆయువు పెంచి
రక్షణ కవచమై ఆదుకుంటాయి

రక్షణకంచెను ఏర్పాటు చేస్తే
ప్రాణికోటికి రక్షగా నిలబడుతాయి

మొక్కుబడిగా వ్యవహరిస్తే
ముక్కోటిదేవతలూ
మనల్ని కాపాడలేరు

ఫోటోలకోసమే
హరతహారం మొక్కుబడిగాచేస్తే
మనఫోటోలకు దండలను
కానుకగా పంపిస్తాయి

తస్మాత్ జాగ్రత్త
వృక్షో రక్షతి రక్షతః


(హరితహారం ప్రారంభం సందర్భంగా...)

..................................................................................................................................
  
వృక్షో రక్షతి రక్షితః_harshanews.com
    గుముడాల చక్రవర్తి గౌడు
    తెలుగు భాషోపాధ్యాయులు
 ZPHS అప్పంపల్లి, సి.సి. కుంట