"నవ్వే సింగారం"

"నవ్వే సింగారం"
Image by Giulia Marotta from Pixabay 

నవ్వడం ఒక భోగం
నవ్వించడం ఒక యోగం
నవ్వలేక పోవడం ఒక రోగం

నవరసాలలో హాస్యరసం ముఖ్యం
నవనీతంలాంటి నీతి కలది నవ్వడం
నవ్వడం నరాలకు నగిషీలు
నవ్వడం చూపులకు చెలికత్తెలు
నవ్వడం నాసికమునకు నాంది పలకడం
నవ్వడం ఆరోగ్యానికి ఆయుష్షునివ్వడం
నగుమోము కలవారు మరి మనోహరులే!!

నవ్వులోని అందమే మన బలం
నవ్వులోని ఆనందమే ఆస్వాదించడం
నవ్వులోని మెళకువలే మెరికదనం
నవ్వులోని నవ్వులే నాలుగు విధాల
చేటుదనం.
నవ్వులోని సిగ్గులే సింగారం
నవ్వుతూ బతికినవాడు తెలివైనవాడు
నవ్వుతూ,నవ్విస్తూ ఉండాలిరా...
సిగ్గులేని వాడిలా నవ్వే సింగారంలా
బతుకద్దురా!!
 
నవ్వుతూ కేరింతల పసిబాలగా
నవ్వుతూ శింగారాల శశిబాలగా
నవ్వుతూ కులుకుతూ నెరజాణగా
నవ్వుతూ జలపాతాలతో జలజాక్షిగా
నవ్వుతూ,నవ్విస్తూ మనసు నిండా
నవ్వుకుని...
నవ్వడం ఒక భోగమని,యోగమని...
రోగం కాదని నిరూపించు మరి!!
..................................................................................................................
           
"నవ్వే సింగారం"
నాట్యమయూరి టి.వి శిరీష,
హైదరాబాద్​.
96184 94909