గుండె గూటిలో..

 గుండె గూటిలో..
 గుండె గూటిలో..

అంతరంగాన అలజడులు
సంద్రంలో అలలై ఉప్పొంగుతున్న
నిన్నటి జ్ఞాపకాలు
రాలినపువ్వులు
వర్తమానం గురించి ఆలోచిస్తూ
భవిష్యత్ భవితవ్యం ఏమిటో
అని మధనపడుతూ
కష్టాలను ఇష్టాలుగా 
మార్చుకున్నాక నాఇష్టాలన్నీ
రాలినపువ్వులు
ఈర్ష్యాద్వేషాలను పటాపంచలు చేసి
అయిన వారికోసం చేస్తున్న
హృదయసాగరమథనం
భావనాయుత మణులను
వెలికితీసే ప్రయత్నంలో
నాలోని అహం
రాలినపువ్వులు
శోధించి సాధించేందుకు
నేనున్నానంటూ ధైర్యం ఇచ్చే
మనసుకోసం నా అన్వేషణ
తోడు దొరికిన ఈవేళ
ఆనందం ఎగిసెను అంబరమంత
గుండెగూటిలో ఈ అనుభవాలు 
పదిలం నిరంతరం
బాధలు,కష్టాలు
రాలినపువ్వులతో సమానం.
................................................................

రవికిరణం-సత్యనీలిమ
వనపర్తి
95021 56813