పోతన మొగ్గలు

పోతన మొగ్గలు
పోతన మొగ్గలు 

కేతన లక్క మాంబల ముద్దుబిడ్దయై 
చదువులమ్మ తల్లి దీవెనలు పొందెను 
అక్షర ప్రతిభకు నీరాజనాలు పలికెను పోతన 

పలికించు రామభద్రుడు అని చాటుతూ 
భాగవతాన్ని బహు చక్కగా రచించాడు 
భక్తులకు కొంగు బంగారమైనది పోతన భాగవతం  

శ్రీకృష్ణ పరమాత్ముని  లీలలను తెల్పుతూ  
 అల్లరి చేష్టలను అద్భుతంగా వర్ణించారు 
ఆబాల గోపాలాన్ని భక్తి పారవశ్యంలో మునక 
లెత్తించారు 

బమ్మెర గ్రామంలో పుట్టిన పోతనామాత్యుడు 
పలురచనలు చేసి తెలుగునాటి వాసి కెక్కారు 
కలము హలము పట్టి తనఘనతను చాటారు. 

హరిభక్తిని లోకమునకు చూపుతూ 
తేట తెలుగు రచనలు చేశారు 
శ్రీరామచంద్రుని భక్తుడు పోతన.
...................................................................................................

  
పోతన మొగ్గలు
 సి.హెచ్. శ్రీనివాసరావు 
 విజయవాడ.
92912 87085