పుస్తక మొగ్గలు


పుస్తక మొగ్గలు
Image by lil_foot_ from Pixabay 

విశ్వ విజ్ఞానాన్ని 
తన హృదయాంతరాలలో
నింపుకొని భవితకి బాటను చూపుతుంది
భవిష్య విజ్ఞాన గని పుస్తకం

విశ్వాంతరాళంలో దాగి ఉన్న సమస్త
విషయాలను మన కళ్లముందుంచుతుంది
విజ్ఞాన అంతరంగ గవాక్షం ఈ పుస్తకం

మనసులోని భావాలకు అక్షరరూపమిస్తూ
వాస్తవానికి ముచ్చటగొలిపే వాక్యరూపమిస్తుంది
అజ్ఞానాంధకారాలను తొలగించే ద్యుతి కిరణం

మస్తిష్కపు మడిలో 
ఎన్నో బీజాలు వేసి
మనసులోని సుగుణ పరిమళాలను 
వెదజల్లేలా చేస్తుంది
అనిర్వచనీయ అక్షర సుగంధం పుస్తకం

మేడలు, మిద్దెలు ఎన్ని సంపాదించినా
ఇలలో పుస్తకమిత్రునికి ఏవి సాటిరావు
అనంత విజ్ఞాన భాండాగారనేస్తం ఈ పుస్తకం

.......................................................................................................
పుస్తక మొగ్గలు
దుగ్గి గాయత్రి
టి.జి.టి.తెలుగు
కల్వకుర్తి
97040 55161