జలమండలిలో ఘనంగా అవిర్భావ వేడుకలు...


  • జెండా ఆవిష్కరణ
  • సిబ్బందికి, వినియోగదారులకు శుభాకాంక్షలు
  • జలమండలి ఎండీ ఎం. దానకిషోర్​

జలమండలిలో ఘనంగా అవిర్భావ వేడుకలు..._harshanews.com
మాట్లాడుతున్న జలమండలి ఎండీ ఎం. దానకిషోర్​

జలమండలిలో 6వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.   ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో జలమండలి ఎండీ ఎం. దానకిషోర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జలమండలి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, వినియోగదారులకు  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఈ వేసవిలో నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు, నీటి కొరత లేకుండా మంచినీటిని సరఫరా చేసినట్లు తెలిపారు.  వర్షాకాలంలో మ్యాన్ హోళ్లు ఉప్పొంగకుండా చర్యలు చేపడుతున్నట్లు  చెప్పారు.  మ్యాన్ హోళ్లకు సెఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.  కోవిడ్ -19 నేపధ్యంలో క్షేత్రస్థాయిలో పారిశుద్ద్య పనులు చేపట్టేటప్పుడు కార్మికులు మాస్కులు, బ్లౌసులు అందజేయాలని మేనేజర్లకు సూచించినట్లు తెలిపారు. పారిశుద్య పనులు చేపట్టిన వెంటనే సోడియం హైపోక్లోరైట్ రసాయనాలు చల్లుతున్నట్లు వివరించారు. అలాగే ఇప్పటీకే ఉన్న ఎస్టీపీలకు తోడు మరో 1000 ఎంఎల్డీల సామర్ధ్యంతో మురుగునీటి శుద్ది కేంద్రాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఈ వర్షాకాలంలో కొండ పోచమ్మ సాగర్ నీటితో నిండితే ఆ రిజర్వాయర్ నుంచి ప్రతిరోజు 170మిలియన్ గ్యాలన్ల నీరు హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలకు తరలించవచ్చని తెలిపారు.  ఈ కార్యక్రమంలో జలమండలి ఎగ్జిజక్యూటివ్ డైరెక్టర్ డా. ఎం. సత్యనారాయణ, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి. రవి, ఫైనాన్స్ డైరెక్టర్ వాసుదేవనాయుడు, ప్రాజెక్టు-2 డైరెక్టర్ డి. శ్రీధర్ బాబు, టెక్నికల్ డైరెక్టర్ వి. ఎల్. ప్రవీణ్ కుమార్, జలమండలి గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు జి. రాంబాబు యాదవ్ లతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.