ప్రేమకు రూపం

ప్రేమకు రూపం
Image by Pana Kutlumpasis from Pixabay 

అన్యోన్యత
మనసుకి రూపం
ఇష్టానికి ప్రతీక
ప్రేమానురాగాలకు,
అభిమానాలకు అద్దం
ఎన్ని ఒడుదుడుకులు ఉన్నా
ఎన్ని అడ్డంకులు ఉన్నా
అన్యోన్యత  ఆనకట్ట ముందు 
అన్ని దిగదుడుపే

కష్టమైనా,నష్టమైనా
అన్ని ఎదురించి
ఎదురీదుతుంది-అన్యోన్యత

చెప్పుడు మాటలను
చెడు విషయాలను
పనికి రాని వాటిని వినదు

నమ్మకమే  పునాదిగా
అంతం  లేని ఆనందంతో
సాగుతుంది  అన్యోన్యత
.......................................................................................................................


ప్రేమకు రూపం
శ్రీలత  సవిడిబోయిన 
సీతానగరం, పర్ణశాల
భద్రాద్రి  కొత్తగూడెం జిల్లా 
 81063 59735