నాన్న..మెరుపులు

నాన్న..మెరుపులు
Image by melindarmacaronikidcom from Pixabay 

గుండె నిండా
ప్రేమను గుప్పించేవాడు
తప్పుదారిలో పోకుండా
నడిపించేవాడు !

అనుక్షణం వెంట
ఉండేవాడు
బతుకుకు పూలబాట
వేసేవాడు !

నిన్ను నిన్నుగా
గుర్తించేవాడు
అన్నింటిలో మేటిగా
తీర్ఛిదిద్దేవాడు !

తన కష్టాలను
దాచి పోరాడేవాడు
మన సుఖాలను
గుర్తించుకునేవాడు !

భవిత బాగా
ఉండాలని తపించేవాడు
మనకు దిక్సూచిగా
నిలిచేవాడు !

నీవంటే ఏమిటో
తెలిసినవాడు
మార్గదర్శకుడై దారేమిటో
సూచించేవాడు !

మన కళ్ళలోని
బాధను గుర్తించేవాడు
మన ఆలోచనలని
ముందే తెలిసినవాడు !

నీవు ఓడిపోతుంటే
వెన్ను తట్టేవాడు
నీవు గెలవాలంటే
ఏంచేయాలో చెప్పేవాడు !

గాంభీర్య ముసుగును
ధరించేవాడు
దానిమాటున ప్రేమను
దాచేవాడు !

భుజం తడుతూ
ప్రోత్సహించే వాడు
ముందుకు తీసుకెళుతూ
గమ్యం చేర్చేవాడు !
......................................................................................................

నాన్న..మెరుపులు
సునీత బండారు.
మహబూబ్​నగర్​,
94406 71530