నేను

 
నేను
నేను

నింగిలో మెరిసే తారను
నీటిలో తేలియాడే తామరను
కవి మదిలో కావ్యాన్ని
రవి యెదలో వెన్నెలని
మువ్వలో నాదాన్ని
మురళి లో గేయాన్ని
శరత్కాలపు వెన్నెలని
వెన్నెలిచ్చే అందాన్ని
వసంతారాణి సౌరభాన్ని
పల్లెల్లో అందాన్ని
మల్లెలలో పరిమళాన్ని
పసిపాప నవ్వులో పవిత్రతని
మమతల నెలవుని
తీగలో రాగాన్ని
నదిలో కెరటాన్ని
సెలయేరు పొంగును
జీవం తో ఉంటే మనిషిని
మానవత్వంతో ఉంటే మనీషి ని.
రోజులు గడిస్తే గతాన్ని.
మంచిచేస్తే చరిత్రలో ఒక పుటని
నేను నేనుగానే ఉన్న నేటి నేను
..............................................................


నేను
డాక్టర్ దేవులపల్లి పద్మజ 
అసిస్టెంట్ ప్రొఫెసర్,
రచయిత్రి, కవయిత్రి