జల మొగ్గలు


జల మొగ్గలు_harshanews.com
జల మొగ్గలు 

అవని గర్భంలో పురుడుపోసుకుంటూ
ఆకాశ గంగై దర్శనమిస్తుంది జలం
అవని ఆకాశానికి జీవనాధారం జలం

ముక్కంటీశ్వరుని తలలో గంగే
సమస్తజీవులకు ప్రాణదారమైతుంది
జలమే సమస్త సృష్టికి జీవనాధారం

పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తూ
పంచభూతాలకు ఆయువువైతుంది
పంచభూతాలు జలంతో పరవశిస్తాయి

మాగాణిమట్టిలో జీవకణము నింపుతూ
మణిమాణిక్యాలకు నెలవైతుంది జలం
మణిమాణిక్యాలకు మూలం జలం

సమస్త జీవానికీ ప్రాణాదారమైతూ
పచ్చని పొలానికి ప్రాణమైతుంది
పచ్చని పంటలకు ప్రాణాదారం జలం

తాను కాలంతో పాటు పయనిస్తూ
కరువు రక్కసిని తరిమికొడుతుంది
ఎతలను తీర్చేే అవనితడి జలం

..........................................................................

జల మొగ్గలు_harshanews.com
ఉప్పరి తిరుమలేష్
అమరచింత మండలం, 
వనపర్తి జిల్లా
96189 61384