తెలంగాణ తేజోమూర్తి .. పీ.వీ నరసింహారావు

 
తెలంగాణ తేజోమూర్తి .. పీ.వీ నరసింహారావు
తెలంగాణ తేజోమూర్తి .. పీ.వీ నరసింహారావు  

తెలంగాణ ముద్దుబిడ్డ, స్వాతంత్ర సమర యోధుడు, గొప్ప రాజకీయవేత్త, పండితుడు,  ఆధునిక చాణిక్యుడు, తెలుగుజాతి రత్నం,పాము లపర్తి వెంకట  నరసింహారావు గారు 1921 జూన్ 28న  వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నె పల్లి గ్రామం లో రుక్మా భాయి, సీతారామారావు పుత్రుడు, దత్తతగా  కరీంనగర్ భీమదేవరపల్లి మండలం వంగరలో పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ దంపతులకు దత్తత పుత్రునిగా పెరిగాడు. కోట్ల ఆస్తికి వారసుడు.

బహుముఖ ప్రజ్ఞాశాలి ,బహుభాషాకోవిదుడు అయిన పి.వి దక్షిణాది నుంచి ఎన్నికైన  తొలిప్రధాని.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా,  ప్రధానిగా దేశానికి అద్భుత సేవలుచేసిన  గొప్ప రాజకీయవేత్త. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని సంస్కరణలతో  గట్టెక్కించి నూతన ఆర్థిక విధానం తెచ్చి ప్రపంచీకరణ నినాదం చేసిన గొప్ప విద్యావేత్త. నవోదయ, గురుకుల పాఠశాలల  ఆద్యుడు. ముఖ్యమంత్రిగా,  ప్రధానిగా, విదేశాంగ శాఖ మంత్రిగా,  గొప్ప పార్లమెంటేరియన్ గా కీర్తిగడించిన మహోన్నత వ్యక్తి. అన్ని దేశాలతో సుహృద్భావాలు ఏర్పరచిన నేర్పరి, సమర్థనాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం. పి. వి. గాంధీస్ఫూర్తితో భూసం స్కరణలు , ఆర్థిక సంస్కరణలు తెచ్చి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న ధీశాలి. సమస్యలకు పరిష్కారం చూపి న్యాయమార్గాలు చూపిన ప్రతిభాశాలి.

17 భాషల్లో  అనర్గళoగా ఉపన్యసించే బహు భాషావేత్త. పి. వి కీర్తి భవితకు స్ఫూర్తి ప్రశాంతం, స్థిమితం, నిశ్చల చిత్తoతో  రాజ్యాంగానికి సంపూర్ణ నిభద్దనతో పాలన సాగించిన గొప్ప విశిష్ఠత గల వ్యక్తి పి. వి. అణు క్షిపణి రంగంలో భారతదేశం అగ్రశక్తిగా బలోపేతం కావాలని ఆశించిన పి. వి.  భారత్ విదేశాంగ విధానానికి కొత్త దశ  దిశ అందించిన దార్శనికుడు.

నాగం (నాగాలాండ్ )తిరుగుబాటు సంస్థలతో సంప్రదింపులు జరిపి, శాంతిభద్రతలు ఏర్పరచిన  శాంతి ప్రియుడు. ఎన్నో రాజకీయకుట్రలు చేసిన దోషవిముక్తుడు అయ్యాడు పి. వి. గారు. కాకతీయ పత్రిక నడిపి "ది ఇన్ స్పైడర్ "అనే ఆత్మ కథ రచన, విశ్వనాథ సత్యనారాయణ  వేయిపడగలు నవలకు హిందీ  అనువాదం.,"సహస్ర ఫన్,"రచన ను,   మరాటి భాషలోని "ఫన్ లక్షతో కోస్ ఘతో" "హరినారాయణఆమ్టే రచించిన రచనను "అబలాజీవితం"గా తెలుగు అనువాధం చేశారు.

తెలంగాణసాయుదపోరాట నేపథ్యంలో "గొల్లరామవ్వకథను", విజయ కలం పేరుతో రచించారు. 2004లో పి. వి గారు స్వర్గస్థులైనారు.

దేశ స్వాతంత్ర పోరాటంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో,  సన్నిహితంగా మెలిగిన మా నాన్న గారి ప్రియ మిత్రుడు పి. వి గారు భారతజాతీఅంతా  గర్వించదగ్గ తేజో కీర్తిమంతు నికి, గొప్ప తత్వవేత్తకు,  ఘన నివాళిగా"భారత రత్న "బిరుదు భారత ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటూ  నమస్సుమాంజలితో....

గొప్ప రాజకీయవేత్తగా, సాహితీవేత్తగా విశ్వవ్యా పితంగా పేరు గడించిన మన తెలుగుతేజం భారత ప్రజల గుండెల్లో పి. వి. చిరస్మరణియులు. 

(పి. వి నరసింహరావు గారి శత జయంతిఉత్సవాల సందర్బంగా ఈ రచన )

................. ..........................................................................................................................
తెలంగాణ తేజోమూర్తి .. పీ.వీ నరసింహారావు
ఎం.ధరణి, 
అచ్చంపేట్, 
నాగర్ కర్నూల్ జిల్లా,  
 96033 72818