నిశ్శబ్ద కవిత్వం

nishabda kavithvam_harshanews.com
నిశ్శబ్ద కవిత్వం..

ఓ ప్రభాతాన సుప్రభాత వేళ.. ఉదయభానుడి..
నులివెచ్చని స్పర్శలా
ఓ చిరుకవిత...

చిరుగాలి చల్లగా మేను తాకినట్లు...
సెలయేటిలో నవ కమలం విరిసినట్లు

పూలు నేల రాలిన సవ్వడిలా..
సెలేయటి స్వరాల మాలికలా....
మెల్ల మెల్ల గా మనో తోటలో
 అక్షర సుమo విరబూస్తుంది..
ఒక్కోసారి ఆత్మీయుల చిరుగాలి స్పర్శ లా...
చల్లగా తాకుతుంది..

నిశ్శబ్ధ నిశీధిలో
నింగి లో తారకలు..
వేచి చూస్తున్నట్లు....
నిండు పున్నమి ఎప్పుడా అని..
వలపులా మేనకలా..
తలపుల నాయికలా జాబిలి కోసం
మూగ గా ఎదురుచూస్తున్నట్లు
గుండె లో భావం నిశ్శబ్ద కవిత లా
పురుడు పోసుకుంటుంది. ఒక్కోసారి..

కడలిలో... ఉవెత్తున లేచే కెరటం లా
భావ తరంగం ..మన మనొకడలిలో...

మరొక్కసారి.. సుళ్ళు తిరుగుతున్న
కన్నీటి సుడి గుండాలు..
మూగ వేదనలు
మూగ రోదనలు
వేదనల వేదికలపై నర్తించి
విలయ తాండవం చేస్తాయి
అక్షరాలు మౌనంగా...
కష్టంలో ,నష్టంలో
కన్నీటి లో.... బయట పడే..
ఆ కవితాక్షరాలు
 కన్న తల్లి చీర చెంగులా
స్వాంతన చేకూరుస్తాయి..

మనసు పెట్టీ చూస్తే..
ప్రకృతి అణువణువు
ఎంతో నిశబ్ధ కవిత్వం..

ఎన్నో మృదు మధురభావాలు..
ఎన్నో జీవితసత్యాలు
గుస గుస గా నిశబ్దం గా..
చెబుతుంది .. ఈ ప్రకృతి.
.......................................................................................................................

మాధవి శ్రీనివాస్​ నందిమళ్ళ
హైదరాబాద్.