ఒక వసంతం..!!

ఒక వసంతం..!!
ఒక వసంతం..!!

ఆకుల అంతా రాలి పోయాక..
కాలం వెళ్లిపోయాక..
చెట్టంత మోడయ్యాక..
ఒక వసంతం వస్తే...
చిగురించిన వృక్షము కళకళలాడుతుంది..

స్వప్నం చెదిరి పోయాక..
గతమంతా కరిగిపోయాక..
బతుకంతా పుండై తే..
 చిన్న ఆశ ఔషధం అయితే..
జీవితం అమృతమై సాగుతుంది..

వీధి బలహీనమైతే..
సమయం కలిసి రాకపోతే..
జీవితం ఎడారి అయితే.
ఒక్క ఆలోచన మెరిస్తే..
ఒయాసిస్ లా చిగురిస్తుంది...

మేఘం కప్పేసింది..
ఆకాశం ముసురుకుంది..
చీకట్లు అలుముకున్నాయి..
ఓ చల్లని గాలి వీచింది..
మేఘం వర్షించి ఆకాశం నిర్మలం అయింది..
................................................................................


ఒక వసంతం..!!
కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235