పోలీసుల సౌకర్యార్థం సబ్సిడీ క్యాంటీన్


  • సైబరాబాద్ కమిషనరేట్ లో ప్రారంభించిన
  • సీపీ వీసీ సజ్జనార్

cp sajjanar_harshanews.com
క్యాంటీన్ ను ప్రారంభిస్తున్న సీపీ వీసీ సజ్జనార్

హైదరాబాద్: కోవిడ్ కరోనా నేపథ్యంలో పోలీసుల సౌకర్యార్థం సబ్సిడీ క్యాంటీన్ ను ప్రారంభించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. శుక్రవారం కమిషరేట్ లో సబ్సిడీ క్యాంటీన్ ను ప్రారంభించి మాట్లాడారు.  ఈ క్యాంటిన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.   ‘పోలీసు సిబ్బంది కుటుంబ అవసరాల నిమిత్తం నిత్యావసరాలు సరుకులు అతి తక్కువ ధరకు, చౌకగా లభిస్తాయన్నారు. ఈ సౌకర్యాన్ని పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం క్యాంటీన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో  సైబరాబాద్ జాయింట్ సీపీ వేంకటేశ్వర రావు, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, ఐపీఎస్, డీసీపీ క్రైమ్స్ రోహిణీ ప్రియదర్శినీ, డీసీపీ బాలానగర్ పద్మజా, విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ (సీఎస్డబ్ల్యూ)ఏడీసీపీ మాణిక్ రాజ్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, ఏడీసీపీ మాదాపూర్ వెంకటేశ్వర్లు ఏడీసీపీ క్రైమ్స్ కవిత, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లు, ఆర్ఐ లు తదితరులు పాల్గొన్నారు.