"సర్వేజనా సుఖినో భవంతు"

 "సర్వేజనా సుఖినో భవంతు"_harshanews.com
 "సర్వేజనా సుఖినో భవంతు" 

నిలువవే పంచవన్నెల దానా..
వయ్యారి మూతి బిగువు దానా..
నీ ముసుగున హొయలున్నదే చానా..
నువు  కులుకుతు మోమున కూర్చుని వుంటే
నిలువదే నా మనసు...ఓ మాస్కూ...
అది నీ పరుగే  తెలుసూ..

నేటి యుగం సరదాలు లేని పరదాల యుగం
నేటి యుగం కలసి ఉంటే కలదు సుఖం కాదు కలసి వుంటే కలుగు దుఃఖం.
నేటి యుగంలో ఐకమత్యమే మహా బలం కాదు ఐకమత్యమే మహా రోగం.
నేటి యుగం మిత్రుత్వానికి అవకాశం లేదు కానీ శత్రుత్వానికి సదవకాశం.
నేటి యుగంలో మా ఇంటికి రండి కాదు మర్యాదగా మీ ఇంటికి పొండి.
నేటి యుగంలో నిండు మనసుతో మాటలు లేవు మూగ మనసుతో పోరాటమే.

నేటి యుగంలో ప్రకృతి మనతో పరాచకాలాడుతోంది,
పరిహాసమాడుతోంది. ఎందుకమ్మా ఇంత వికృతమైన ఆగ్రహం,ఆవేశం?
ఇందులేను,అందులేనని సందేహము వలదని
జనుల బలి తీసికొని,విలయ తాండవము
చేస్తున్న నిన్ను శాంతింపచేయుట ఎలా?

కలి పురుషుడు కలుషితం చేసిన భూమి
నీకు భారమైనదా భూదేవి?
ధరణికి గిరి భారమా...
గిరికి తరువు భారమైనట్టు
మనసు బాధించినదా తల్లీ?
కనుమరుగై నీ బిడ్డలను పరీక్షించి,
నీ యందు భక్తి ప్రపత్తులతో
మెలగవలెనని గుణపాఠం
నేర్పినందులకు శిరసు వొంచి..
కరములు జోడించి నమస్కరిస్తూ...

 "సర్వేజనా సుఖినో భవంతు". "సర్వేజనా సుఖినో భవంతు"_harshanews.com
నాట్యమయూరి టి.వి శిరీష,
హైదరాబాద్​.
96184 94909