"నీ తోడై నిలిచేది "

"నీ తోడై నిలిచేది "_harshanews.com
"నీ తోడై నిలిచేది " పల్లవి :

నీ పుట్టిన రోజు నాడు ఒక చెట్టును నాటి చూడు
ఏటేటా నీ తోడై ఎదిగి నిన్ను ఎదిగిస్తుంది ,
ఎదిగి నిన్ను ఎదిగిస్తుంది.

చరణం 1)
అమ్మ నాన్న ఇచ్చిన తనువు
జీవంతో ఉండాలంటే ,
ప్రాణవాయువెక్కడిదో ,
తెలుసు కుంటే
ఎంతో మేలు /తెలుసు /
మనమిడిచిన చెడు వాయువును
తనలోనా చేర్చుకుంటూ,
ప్రాణవాయువు మనకిచ్చి
మన బతుకును నిలుపును చెట్టు /నీ/

చరణం :2)
గాలి నీరు ఆహారం మనిషి బ్రతుకు
కాధారం ,ఆ ఆధారం ఎక్కడిదో
తెలుసుకుంటే అదియే మేలు /తె /
సాగిపోయే మేఘాన్ని చల్లబరిచి నీటిని
రాల్చి ,ఆహారం తానే ఇచ్చి -మన
బతుకును నిలుపును చెట్టు /నీ /

చరణం 3)
బతికి మనకు బతుకును ఇచ్చి ,
ఆపైన మన గూడై ,
మన నీడ తానౌతుంది
పక్షులకు ,పశువులకు -
ప్రకృతమ్మ ఒరవడికి ఆధారం తానై చెట్టు
అనంతమై నిలుచును చెట్టు /అనంత/
నీ పుట్టిన రోజు నాడు
ఒక చెట్టును నాటాలి
ఆ చెట్టే నీ తోడై
నీ జీవం నిలుపును చెట్టు.
.....................................................................................................
"నీ తోడై నిలిచేది "_harshanews.com
డాక్టర్ బండారు సుజాతశేఖర్ 
 హైదరాబాద్​
 98664 26640