వెనువెంటనే..

Venuventaney_harshanews.com
వెనువెంటనే..

నిత్యం వెంపర్లాటే
అమ్మ గర్భంలో  పిండంగా ఉన్నా
రోజులు గడుస్తున్నాయి
బయటకి రావాలని ఆరాటం

వచ్చేశా...
త్వరగా ఎదగాలని...
జ్ఞానం కోసం వెతుకులాట
పాఠశాల,కళాశాల దాటేశా
నా కంటూ ఓ కుటుంబం
నా కంటు ఓ గుర్తింపు
వృత్తిగా,ప్రవృత్తిగా
బంధాలను గౌరవించా కొన్నిసార్లు
అనుబంధాలను తెంచేసే మరికొన్నిసార్లు
సంపాదనా వ్యామోహంలో పడిపోయే
లేవలేనంత
గుండె "డబ్  డబ్" మర్చిపోయి
డబ్బు డబ్బు అని కొట్టుకునేంత

రోగాలతో,రొంపులతో
మంచానికే పరిమితమై
చివరకి చివరి దశ
రాలిపోయే ఆకులా
విరిగిన కొమ్మలా
కాలి మిగిలిన బూడిదలా
చివరాకరకు నేను చేసిన
కీడూ,మేలే వచ్చేను
నా పేరు తలంచిన వెనువెంటనే...
.......................................................................................................
శ్రీలత  సవిడిబోయిన (శ్రీ)
సీతానగరం, పర్ణశాల
భద్రాద్రి  కొత్తగూడెం జిల్లా 
 81063 59735