భద్రత

badratha_harshanews.com
భద్రత


   సందర్భం : జూన్ 7 ప్రపంచ ఆహార భద్రత దినం    


నేడు ప్రపంచ ఆహార భద్రతా దినం !
అమ్మ గోరుముద్ద అందాలి అందరికి అనుదినం !!

మానవ మనుగడకి కావాలి ఆహారం !
దానికొరకే అనునిత్యం ప్రదర్శిస్తున్నారు ఆహార్యం !!

పంటని నిలుపుటకు క్రిమిసంహారం !
రైతే రాజని  అతనికి మణిహారం !!

చేయరాదు ఆహారం వృధా  !
తెలుసుకోవలంతా ఆకలిమంటల వ్యధ !!

పేరుకు మనది సంక్షేమ రాజ్యం !
పేదోని ఆకలికి భరోసా పూజ్యం !!

ఆహారాధాన్యం లభ్యత ప్రకృతి సృష్టి !
పాలకులు సారించాలి వాటి భద్రతపై దృష్టి !!

అణ్వస్త్రాలపైనే ప్రపంచం ధ్యాస !
అన్నవస్త్రాలపై  చేయని అభ్యాసం !!

పిజ్జాలు , బర్గర్లు , ఫాస్ట్ ఫుడ్స్ లు అరక్షితం !
చిరుధాన్యాలే ఆరోగ్యానికి సురక్షితం !!

అమిత జనాభా వల్ల వచ్చేను తిండిగింజల రగడ !
ప్రశ్నార్ధకమగును అపుడిక మానవుని మనుగడ !!


badratha_harshanews.com
వోరుగంటి శ్రీ వెంకటేష్ బాబు
ఎం.ఏ., ఎం.ఫిల్., ( పి.హెచ్ డి )
ఖమ్మం
  98497 40116
Attachments area