తేజం - నిస్తేజం

తేజం - నిస్తేజం_harshanews.com
తేజం - నిస్తేజం

డ్రాగన్ దాడుల్లో జవాన్ల వీర మరణం !
తీర్చుకుంటిరి కదా జన్మభూమి ఋణం !!

చేసితిరా జాతి కోసం రక్త తర్పణం !
మాతృభూమి కొరకు ప్రాణర్పణం !!

సరిహద్దుల్లో అమరుడైన 
మన తెలుగు తేజం (సంతోష్) !
మీ మరణం తో మేమంతా నిస్తేజం !!

ఓ సైనో (చైనా)....
నాడు పంచశీల కు చేసితివి పంచనామా !
నమ్మకద్రోహనికి నీఓ చిరునామా !!

1962 లో చాటుమాటు దాడితో 
హాని తలపెడితివి !
'హిందీ - చినీ భాయ్ భాయ్' 
నినాదాన్ని మట్టు పెడితివి !!

కాలరాస్తుంటివి హద్దులు !
ఇంకా చెబుతావెందుకు సుద్దులు !!

మార్చుకో నీ బుద్ధులు !
అపుడే శాంతించును సరిహద్దులు !!

ఓ నంగానాచి చైనా !
సరిచేసుకో నీ విధానం ఇకనుంచైనా !!

నీది నీతిమాలిన వ్యవహారం !
చేసావుకదా విలువల సంహారం !!

నేటి దాడులకు అడ్డా 'గాల్వాన్' !
శాంతి సాధనలో 
ఎప్పటికీ ఇండియా నే పహిల్వాన్ !!

గాల్వాన్ సంఘటన లో అమరులయిన 
మన వీర జవాన్లకు నివాళులు అర్పిస్తూ....
వారికి నా అక్షర నివాళి.
 (ప్రపంచశాంతి వర్ధిల్లాలి )
.....................................................................................................
తేజం - నిస్తేజం_harshanews.com
వోరుగంటి శ్రీ వెంకటేష్ బాబు
     ఎం.ఏ., ఎం.ఫిల్., (పి.హెచ్ డి ).,
98497 40116