నాన్న వెనుకబడ్డాడు..

నాన్న వెనుకబడ్డాడు..
Image by StockSnap from Pixabay 

క్రమశిక్షణ పేరుతో క్రమం తప్పక
బిడ్డల్ని అదిలించి దూరం పెట్టాడు

నవమాసాలు మోసేందుకు
కారణమై కూడా అమ్మలో సగమైనా
వెనుకే ఉండి వెనకబడ్డాడు

అయినా పిచ్చిగానీ..

ఆయన ఎక్కడ
ఎప్పుడు వెనకబడ్డాడు..
ప్రతి తరంలోనూ..
ఎప్పుడూ ముందే..

వెనక్కు తగ్గనంత
ఎత్తుగా ఉన్నాడు..
కుటుంబ శ్రేయస్సే
ఆయన ఆరాటమైతే...
.....................................................................................
సాహితి ప్రియ,

హైదరాబాద్​