హరితం..హరితం

హరితం..హరితం
హరితం..హరితం


హరితం హరితం... !
కావాలి సతతం సతతం !!
చెట్లు అందించును ప్రాణవాయువు !
అవి నిలుపును మన ఆయువు !!

చెట్లు నాటు కార్యక్రమం బృహత్తరం !
వాటిని కాపాడుతే ఇక పర్యావరణం మహత్తరం !!

హరితం హరితం... !
కావాలి సతతం సతతం !!
పచ్చదనం విరియాలి !
నేలతల్లి మురవాలి !!


అడవిలో చెట్లు మాయం !
నేటి 'వీరప్పన్' ల మాయోపాయం !!

హరితం హరితం... !
కావాలి సతతం సతతం !!
చేయాలి వన సంరక్షణ !
కావాలి నాటిన మొక్కలకు పరిరక్షణ !!

అభివృద్ధిలో భాగం పారిశ్రామిక ప్రగతి !
పెరిగుతున్న కాలుష్యంతో తల్లడిల్లుతున్న జగతి !!

హరితం హరితం... !
కావాలి సతతం సతతం !!
అక్రమంగా చెట్ల నరికివేత !
అది వనదేవతకు గుండెకోత !!

ప్రత్యేక ఆర్థిక మండళ్లతో పర్యావరణానికి తూట్లు !
వేలాది ఏకరాల లాండ్ పూలింగ్ తో రైతన్నలపాట్లు !!

హరితం హరితం... !
కావాలి సతతం సతతం !!
ప్రతి ఒక్కరం ఒక మొక్కను నాటుదాం !
దాని విలువను నలుదిక్కుల చాటుదాం !

వృక్ష సంపదే పర్యావరణానికి అమూల్యం !
నిర్లక్ష్యం చేస్తే మానవాళి చెల్లించాలి భారీ మూల్యం !!

 .......................................................................................................


హరితం..హరితం
వోరుగంటి శ్రీ వెంకటేష్ బాబు
 ఎం.ఏ., ఎం.ఫిల్., ( పి.హెచ్ డి )
 ఖమ్మం.
 98497 40116