'రామశతకం'

ఆ శ్రీరాముడు మనుష్యమాత్రుడై అందరికీ ప్రేమపాత్రునిగా భాసిల్లటం భక్తకోటికి రమణీయమైతే ఈ రాముడుమానవతాపాత్రుడై చేసిన సామాజిక ఉద్భోధలుకడు దర్శనీయాలు, ఆచరణీయాలు.
'రామశతకం'(సరళపదపద్యరవళి)శతకకర్తడి.ఎన్.వి.రామశర్మగారుస్వస్థలం ఆం.ప్ర కి చెందిన గుంటూరుజిల్లా.వృత్తిరీత్యాబెంగళూరు అయినప్పటికీ తెలుగుభాష, సాహిత్యంమీద మమకారంతో పలుసాహితీప్రక్రియలనువెలయించటంలో అగ్రగణ్యులు.
"పల్లవింపముదముపలుకు రామ"అనే మకుటంతోఈశతక పుస్తకము వెయ్యిన్నూరు మధురసుగంధపరిమళాలై సాహితీదిగంతాలను తాకుతూ సామాజిక చైతన్యానికి మార్గదిక్సూచులుగామారాయనటంలో ఎటువంటి అతిశయోక్తీలేదు.

1,3పాదాల్లో వస్తువును,నీతిని;2వ పాదంలో ఆలోచనావిధానాన్నివికసింపజేశారుకవి.
  సమీక్షకురాలు
 సోంపాక సీత
 86393 11050
ఆధునికవిజ్జ్ఞానం అన్నిటా వ్యాపించిన ఈరోజుల్లోకూడా లింగవివక్ష అనేజాడ్యంఇటు కుటుంబాలలోనూ,అటుసామాజికరంగాలన్నిటా తిష్టవేసి స్త్రీ జాతినిఆత్మన్యూనతల సుడిగుండంలోకి నెట్టివేస్తున్న నేటి నేపథ్యంలో తమ మొదటిపద్యంలోనే "అందచందమందు అపురూపమౌ సుత"(పాదం1); కొడుకుతో సమముగ కొలమానమన్నిట(పాదం3)అనటం ద్వారా ప్రతిఇంట్లో ఆడపిల్లలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్నిచెప్పకనే చెప్పినట్లయింది.

2వ,పద్యం...అందమన్న మనసునందె జూడుమెపుడు(పాదం1); వయసుడిగినయంత వాడిపోదు మనసు (పాదం3) మనుష్యుల్లో బాహ్యసౌందర్యంకంటే అంతః సౌందర్యానికే విలువనివ్వాలని తెలిపే ముత్యమంటి భావాలు.

5వ,పద్యం...అమ్మనోటి మాట కమ్మగా వినుమన్న(పాదం1); అమ్మకన్న మిన్న యవనియందెవరన్న(పాదం3) మాతృమూర్తిగొప్పదనాన్ని సాక్షాత్కరింపజేసిన మృదుభావజాలం

11వ,పద్యం....ఆసుపత్రియన యనారోగ్యమునుబాపు 'ప్రతి ఆసుపత్రి ఓ దెవాలయం లాంటిదంటూ వైద్యులకూ,రోగులకూ ఈ సేవాసంస్థపట్ల వుండవలసిన ప్రేమను,బాధ్యతను గుర్తుచేశారు

16వ,పద్యం....వేళపట్టున కడుపుకింత తిండికూడా తినక ఉరుకులు,పరుగులు పెట్టే జీవితానికి ఎపుడు కలుగుతుందిహాయి ? వీటన్నింటికంటే ఆరోగ్యం ముఖ్యంగదా!అంటూ పరోక్షంగా ప్రశ్నిస్తుందిఈపద్యం"ఉరుకులు పరుగులన్నియు యుపయోగమే సున్న"

20వ,పద్యం...ఎవరిగూర్చి యెవ్వరేమి చెప్పిన గూడ" ఎదుటివాని గూర్చి ఎవరేమి చెప్పినా వినకు ? వారిమనసు తెలుసుకుని నిజమెరిగి నడుచుకొమ్మనే హితవు చెప్పిన పద్యం

21వ,పద్యం... "ఒక్కమొక్కలేదు లెక్కకై యెక్కడ" అనే ఆలోచనాత్మక పద్యంలో జలచక్రంలో తరువులకున్నప్రాధాన్యతనుఇలా ఎరుకచేస్తున్నారు.మొక్కలు మచ్చుకైనా కనబడని నేటి కాంక్రీటువనాల్లోని జనజీవనానికి ఉక్కపోత తప్ప చల్లనిగాలి ఎక్కడిది?అంటారు.నిజమేగదండీ?

31వ,పద్యం... మనకు విద్యనేర్పిన బడి,మనం మ్రొక్కే గుడి ...ఇవిరెండూ నీ విజ్ఞతను పెంచే ధారణా గనులంటూ వాటిని నీ మదిలో ముద్రించుకోగలిగితే నీకు విజయం తథ్యమంటారు.

33,34పద్యాలలో "మనకు తిండిపెట్టు మాన్యుడతడు'అని మెతుకు పండించే కర్షకుని గురించి "దేశరక్షణమే ధ్యేయమ్మైన సైనికులకు జయము"పలుకవలెనంటూ దేశభద్రతకై ప్రాణాలొడ్డే వీరజవాన్ల గురించి చక్కగా వచియించారు

36వ,పద్యం..."చీమ చిన్నదయిన నేమిటి?చూచిన"బారులు తీరి క్రమశిక్షణతో నడిచే చీమల గమనం నేటి సమాజంలో మానవులకెంతో ఆదర్శప్రాయమంటారుకవి.

46,47పద్యాలలో...మంచినడత,మంచిమాట,చెలిమి విలువ ఇవే ముఖ్యం మనుష్యులకు .ధనమెంతమాత్రమూ కాదని,మనసునందుమంచి తలంపుతో సాగాలని చక్కని ఉద్భోధ చేశారు

72వ,పద్యం..."బాహ్యమందమెంత భాసిల్లగానేమి ?"బాహ్యసౌందర్యంకంటే అంతః సౌందర్యమే మాననీయమని,సొగసు కంటే గుణమే మిన్న అంటూ ...వికృతపోకడలకు చిన్నచురకంటించారు

73వ,పద్యం... "బి.పి పెరుగునంతభీభత్సపుటలుక"...కోపంతారాస్థాయికి చేరితే అదిహై.బి.పి గామారి నోటమాటలేకుండా చేసేస్తుందని ,అదే సుగరు'పెరిగితే విసుగు పెరుగుతుందని..నీకెందుకీ శిక్షలు? హాయిగా మనసారా నవ్వరాదా? అంటారు

సుద్దులు,బుద్ధులు ఇవేకాదండోయ్...! అక్కడక్కడాఉల్లాసభరితమైన చెణుకుల్నికూడావిసిరి ఔరా!అన్పించాయికొన్నిపద్యాలు

82వ,పద్యం..."మలుపులున్ననేమి మార్గమధ్యమున?"మనం చేరుకోవాల్సినగమ్యం మన ఎరుకలోవున్నపుడు మధ్యలో ఎన్నిమలుపులు,ఆటంకాలు ఎదురైతే మనకేంటి? అలుపెరుగక సాగే పయనం నీదవ్వాలంటూ లక్ష్యసాధకులకు ప్రోత్సాహక టానిక్ ను పంచిందిఈ పద్యం

101వ,పద్యం... "కలుపుమొక్కలేరి కళ్లాపిజల్లగ"పంచభూతాల సమ్మిళితమే ప్రకృతంటే.ఈ ప్రకృతిని మనం కలుషితం చేయరాదని హితవు చెబుతూ పర్యావరణం పట్ల తమ వాత్సల్యాన్ని చాటారుకవి

104వ,పద్యం... "మనసుమాట వినుము మాన్యమైనదెపుడు"ఈపద్యంద్వారా అడుగు వేయకముందే మనసనే అద్దంలోకి తొంగిచూడు? అదితప్పో?ఒప్పో ?ఇట్టే తేల్చిచెబుతుంది.నీ మనస్సంటూ కూడనిపని చేసి తర్వాత వగపు నిరర్థకమనే నిగూఢమైన అర్థాన్ని పల్లవింపజేశారు

105వ,పద్యం... "కల్లబొల్లిమాటలకందనంతగనుండు"ఎవ్వరితోనైనా వాళ్లమాటలనుబట్టి చేతలను బట్టి ఒక్కసారె అంచనావెయ్యటంకాదు? కొద్దికాలం గమనిస్తే అదితీపో?చేదో? తెలుస్తుందంటూ ఓ చక్కని సమాజ గమనాన్ని ,మేడిపండు వింతలను ప్రస్ఫుటంచేసిందీపద్యం.

తెలుగుభాషలోని మాధుర్యాన్ని మన సభ్యత,సంస్క్రుతీ సాంప్రదాయాలలోని చిక్కదనాన్ని నింపుకుంటూ,వైజ్ఞానికతను ఒంపుకుంటూ సాగిన ఈ రామశతకంలోని పద్యాలు చిన్నారులు నేర్చుకుని భాషాభిమానాన్ని పెంచుకొనుటకు ఎంతగానో దోహదపడగలదని,పుస్తకబహుమతిగా హైస్కూల్ స్థాయి విద్యార్థినీ,విద్యార్థులచేత ఒదగగలదని ఆశిస్తూకవికలం నుండి మరిన్ని చైతన్యభరిత శతకాలుజాలువారాలని అభినందనలు తెలుపుతూ...

   
....................................................................................................................

వెల:50రూ.ప్రతులకుడి.ఎన్.వి.రామశర్మ1906,5వ,క్రాస్,20వమెయిన్ రోడ్డుజె.పి నగర్,2వ,ఫేజ్బెంగుళూరు--560078సెల్ నం:9663526008.....................................................................................................................