గుప్పెడు గువ్వలు ...

గుప్పెడు గువ్వలు ...
గుప్పెడు గువ్వలు ...
వేదనలందం చెక్కిళ్ళపై జారింది .... కనుల కొలనులో ఇమడలేక… వెతలూ అందుకే నేలరాలి వెతుక్కుంటున్నాయి ... క్రొత్త జీవితాలను పలకరించాలని… మోయలేని మాయలెన్నో మనసుకు... తనువును గాయపరుస్తూ…. అందుకే మనసు మౌనాన్ని వెతుక్కుంటోంది... అనుబంధాల ఆరళ్ళు తట్టుకోవడానికి సన్నద్ధమౌతూ… ఎంతైనా మది గాయానికీ గుట్టెక్కువే .... ముక్కలైన మనసును అదిమి పెట్టుకునేంతలా అక్కడ కొన్ని పగిలిన గాజుమనసులున్నాయి.... విరిగాకే బింబాలు చూపి వెక్కిరించేందుకు అయినా ఎప్పుడో అప్పుడు కన్నీటి పర్వతం బ్రద్దలౌతూనే ఉంటుంది చేరుతున్న చెక్కిట్లో అగ్గి పుట్టిస్తూ ఏంటో…. చిత్తానికి సరళత తగ్గుతోంది .. కాలం కోపగిస్తుంటే….
తెలిసిందిప్పుడే మనుషులక్కొరతైందనీ....
స్వార్ధపు పులి దాడి చేసేస్తోందనీ ఇలాగే ఎన్నో ఎన్నెన్నో మిగిలున్నాయి... మొత్తం భావాన్ని అక్షర అలలుగా లెక్కేసుకున్నా ఇంకా మిగిలుంటున్నాయి.... తీరం చేరని కెరటాల్లా...కంచికి చేరని కధల్లా.. అందుకే నా అక్షరాలు ... గుప్పిట్లో గువ్వలే ... ఎప్పటికీ ఎగరలేవందుకే .....

..............................................................................................

గుప్పెడు గువ్వలు ...
పద్మ కుమారి.పి
హైదరాబాద్​