వరంగల్​సీపీకి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సన్మానం

వరంగల్​సీపీకి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సన్మానం
వరంగల్​సీపీకి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సన్మానం

కరోనా వైరస్ ను నియంత్రించడంలో పోలీస్​అధికారులు, సిబ్బంది పనితీరుపై అభినందిస్తూ  తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యులు వరంగల్ పోలీస్  కమిషనర్  డా.రవీందర్​ను  ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సమాఖ్య సభ్యులు మాట్లాడుతూ.. అనునిత్యం ప్రజలను వైరస్​ బారిన పడకుండా పోలీసులు అవగాహన కల్పించారని తెలిపారు. వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల కోసం శ్రమించారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో రాష్ట అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు మోత్కూర్ రాము, ప్రదాన కార్యదర్శి ఐనవోలు ప్రవీన్ శర్మ , కోషాధికారి విష్ణుదాసు వంశి,  వైదిక కార్యధర్షి భువనేశ్వ ర్, దేవాలయ ప్రదానార్చకులు బ్రహ్మణపల్లి మధు శర్మ , ఉపాధ్యక్షుడు పద్మాక్షి దేవాలయ అర్చకులు షణ్ముఖ ఘణాపాటి  పాల్గోన్నారు.