‘వైరాగ్య’

‘వైరాగ్య’_harshanews.com
Image by peter_pyw from Pixabay 


ఏమి ఆకర్షణ, ఏమి అందం? 
ఒక్క చూపుకే జన్మ రాహిత్యం ఇచ్చేంత! 

వెన్నెల రాత్రి
నడి సముద్రపు అలల
వెలుగంత నిశ్చింత!

ఉత్తర దృవంలో పాలమీగడ...,
ఆఫ్రికా అడవుల్లోని తూనీగ ధైర్యం,
అమెజాన్ తేనెతుట్టె బలం,
సహారా ఎడారిలో
గాలి దుమ్ముల పోరాటం తర్వాత
బంగారు ఇసుక తిన్నెలపై
వెలిసిన నునుపైన
ఆ సరళ రేఖల సౌందర్యం!
తూర్పు కనుమల నిశ్శబ్దం....

అన్నీ ఒక్క పేరులో ఉన్నాయా?
మీరు ప్రేమిస్తే సరిపోదు!
మీ జన్మ ధన్యం కావాలంటే
తన కరుణా కటాక్షాలకి
మీరు పాత్రులు కావాలి.

ఎన్ని జన్మల పుణ్యం ఉంటే  సాధ్యమో!
అది జన్మ రాహిత్యం!
లేదంటే మళ్లీ ఈ మాయలో...
ఈ బురదలో పొర్లాడ వలసిందే!

ఎందుకు నా చేయి
పట్టుకున్నావు "వై?"
నన్ను జీవితంలో 
కృతార్ధుడిని చేస్తూ...
......................................................................................................
     
‘వైరాగ్య’_harshanews.com
శ్రీనివాస రాజు పెన్మెత్స 
95509 81531