మాతృదేవోభవ

మాతృదేవోభవ
మాతృదేవోభవ

గాయకులు 
గాయనీమణులు
పాడే పాటలు మధురం

కానీ
మా అమ్మ పాడే పాటలు
ఇక్షు రసము కంటే అతి మధురం
నలభీమ పాకం ఎంత రుచికరమో
మా అమ్మ వంటకాలు అంతకంటే  సురుచికరం
చూడడానికి సింగిడి ఎంత అందమో
మా అమ్మ తీర్చిదిద్దిన
రంగవల్లుల లోగిలి
అంతకంటే అందం
ఇంద్రభవనం సుందరమైనదే

కానీ
మా అమ్మచే అలంకరించబడిన
మా ఇల్లు అతి సుందరం
మణులలో మణిపూస మా అమ్మ మనసు
జగాన సాటి ఇంకెవరూ లేరు

అందుకే
మాతృదేవోభవ అంటూ
ఆది స్థానంలో నిలిచిన అమ్మ
ప్రేమ వాత్సల్యాలను పంచే అపురూప దేవత .
 
.............................................................................................

మాతృదేవోభవ_harshanews.com
డాక్టర్ పోల సాయిజ్యోతి,
తెలుగు ఉపాధ్యాయురాలు, 
అచ్చంపేట, నాగర్ కర్నూలు జిల్లా,
 98485 43742.