నాన్నా నీవు....

       
నాన్నా నీవు....
Image by freestocks-photos from Pixabay 
       
నాన్నా నీవు...
దైవానికి ప్రతిరూపం !
నీ ప్రేమ అపురూపం !!

సంతానమంటే నీకు ప్రీతి !
మా అందరి ఎడల ఒకే నీతి !!

             
నాన్నా నీవు...
కుటుంబం కొరకు చిందిస్తావు స్వేదం !
నీ గాంభీర్యం తో కనపడనివ్వవు నిర్వేదం !!

బాటను చూపే మార్గదర్శివి !
సలహాలిచ్చే కార్యదర్శివి !!
                
 నాన్నా నీవు...
నడక నేర్చుటకు అందిస్తావు చిటికెనవేలు !
మా భవిష్యత్తుకు వెచ్చిస్తావు వేలకువేలు !!

ఆలోచిస్తావు అందరి క్షేమం !
దరి చేరనివ్వవు క్షామం !!

 
నాన్నా నీవు......
చెంత ఉంటే మాకో ధైర్యం !
నిను తలుచుకుంటే కలుగును మనోస్తైర్యం !!

మీరే మాకు జీవం !
మీరంటే ఎంతో గౌరవం !!

నాన్నా నీవు...
మీరే లేకుంటే ఎక్కడిది జీవితం !
చెప్పే ప్రతి మాట ఎంతో సునిశితం !!

పరితపిస్తావు మాకొరకు అనుక్షణం !
కాపాడుకుంటావు మమ్ములను క్షణక్షణం !!

నాన్నా నీవు...
ఆలోచనలకిస్తావు కార్యరూపం !
ఆగ్రహమొస్తే చూపుతావు విశ్వరూపం !!

నీ వ్యక్తిత్వమే మాకు ఆభరణం !
తీర్చుకోగలమా ! మీ ఋణం !!

సందర్భం : 'ఫాదర్స్ డే 'సందర్భంగా  అక్షర ప్రణతులతో
..........................................................................................................

నాన్నా నీవు....
వోరుగంటి శ్రీ వెంకటేష్ బాబు
  ఎం.ఏ., ఎం.ఫిల్., (పి.హెచ్ డి )
98497 40116
 ఖమ్మం