ఆమెను ఆమెలా... చూడండి

ఆమెను ఆమెలా... చూడండి
ఆమెను ఆమెలా... చూడండి


ఆమె ఆకలి ఎవ్వరి కీ పట్టదు ఐనా అందరికీ అన్నపూర్ణ  ఆమె హృదయం కడలి లోతు అంటారు .. ఆ కడలిలోతుల్లో సుడి గుండాలు పట్టించుకోరు ఆ నయనం కమలం అంటారు.. అవి కార్చే కన్నీరు కనిపించదు ఎవ్వరికీ..

పిడికెడు ప్రేమ కు జీవితకాలం  ప్రాణం పెడుతుంది.. ఆ పంచప్రాణాలు గాలి లో కలిసిపోయాక అప్పుడు తెలుస్తుంది..జీవం నింపే పంచ భూతాలతో పాటు.. ఆమె  కూడా
ప్రాణం నిలిపే ప్రేమ సిరి అని..

నిజమే ఆమె ఎవ్వరి కీ అర్దం కాదు ఎందుకంటే..

ఆమె భాద్యతల బంధీ లో..ఆంక్షల సంకెళ్లు పెనవేసుకున్నా పెదాల పై నవ్వు ను పులుముకొని ఒక్కోసారి తన  ఉనికి ని కూడా మర్చిపోయి జీవిత నౌక ను నడిపే..చుక్కాని..

ఆమె ను దేవత లా గుడి కట్టుకొని అపురూపం గా చూడకపోయినా.. ఆమె ను ఆమె లాగే  ఉండనీ యండి..ఆమెకు కలలుంటాయి,చిన్ని చిన్ని సంతోషాలు,అనుభూతులు..ఆత్మీయతలు ఉంటాయి.. వాటి ని వదిలేయమని చెప్పకండి... గౌర వించండి

ఒక చిన్న చిరునవ్వు తో పలకరించండి
నేను ఉన్నాను అని ఓ చిన్ని భరోసా ఇవ్వండి
ఎన్ని భాదలైనా నవ్వుతూ భరిస్తది..
ఓ చిరు ఆత్మీయపు స్పర్శ కు ఆమె ప్రాణం వేచి చూస్తది..

ఎంత వయస్సు వచ్చినా..జన్మ ను ఇచ్చినా ప్రతి స్త్రీ  ఓ పసి పాప లా లాలన పొందాలని కుంటుంది అర్దం చేసుకోండి..


ఆమె లాలి పాటల లాలిత్యా న్ని పొంద డానికి.. ఆ అమ్మతనం లో..ఉండే కొలమానం లేని ప్రేమ ను పొంద డానికి...  త్రిమూర్తులే అవతారమెత్తారు. సృష్టి కి ప్రతిసృష్టి చేసే ఆమె కారణజన్మురాలు.. ఆమె ను ఆమె లాగే జీవించ నీయండి..

.........................................................
మాధవి శ్రీనివాస్ నందిమళ్ళ
హైదరాబాద్.