నిర్లక్ష్య ధోరణితో వాహనాలు నడపడంతోనే ప్రమాదాలు


  •  రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలకు నష్టం
  • నియమాలు పాటిస్తే సురక్షిత ప్రయాణం
  • మెదక్​ జిల్లా ఎస్పీ చందన దీప్తి

నిర్లక్ష్య ధోరణితో వాహనాలు నడపడంతోనే ప్రమాదాలు
పోలీస్​ సిబ్బంది ఆధ్వరంలో గుంతలు పడిన రోడ్డున చదువు చేస్తున్న దృశ్యం
sp chandana deepthi_harshanews.com
మాట్లాడుతున్న మెదక్​ జిల్లా ఎస్పీ చందన దీప్తి

మెదక్​: నిర్లక్ష్య ధోరణితో వాహనాలు నడుపడంతోనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని మెదక్​ జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు.  హావేలిఘనపూర్ పి.ఎస్. పరిధిలోని లెప్రసి హాస్పిటల్ ముందు పోలీస్​ సిబ్బంది ఆధ్వర్యంలో సుమారు 200 మీటర్ల మేర  రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చి చదునుచేశారు. ఈ సందర్భంగా ఎస్పీ చందనదీప్తి మాట్లాడుతూ..  ప్రజలు రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ నియమ నిబంధనలు పాటిస్తు సురక్షిత ప్రయాణం కొనసాగించాని,  ప్రమాదాలు నివారించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అత్యధిక ప్రమాదాలు డ్రైవర్లకు నిద్రలేకపోవడం, అతివేగంగా వాహనాలు నడపడం వలన జరుగుతున్నాయని అన్నారు. ఒక రోడ్డు ప్రమాదం అనేక కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని, ధన ప్రాణ నష్టాలను కల్గిస్తాయని వీటిని దృష్టిలో ఉంచుకొని తమ ప్రయాణాలను సురక్షితంగా కొనసాగించాలని అన్నారు.   రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులందరూ ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.  ప్రజలు  ప్రమాదాల బారిన పడకుండా  ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్‌ నియమాలను పాటించాలని, ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పకుండా హెల్మెట్‌ వినియోగించి వాహనాలు నడపాలని అన్నారు. జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలలో రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, జిల్లాలోని ప్రజలందరూ ట్రాఫిక్‌ నియమాలు పాటించే విధంగా కృషి చేయాలని కోరారు. ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, ఆ ప్రదేశాల్లో భవిషత్తులో ప్రమాదాలు జరగకుండా నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.