పీవీ మొగ్గలు

పీవీ మొగ్గలు
పీవీ మొగ్గలు 

వరంగల్లోపుట్టి, కరీంనగర్ కు దత్తపుత్రుడిగావెళ్లి
విద్యార్థిదశలోనే నైజాం పాలనని వ్యతిరేకించాడు
హైదరాబాద్ సంస్థాన విముక్తికై పోరాడిన పివి

రామానందతీర్థ రాజకీయ గురువుగా నెంచి
కాంగ్రెస్ లో చేరి రాజకీయజీవితం ప్రారంభించాడు
భారతయవనికపై వెలిగిన రాజనీతిజ్ఞుడు పివి

పదిహేడుభాషలు అవలీలగా నేర్చుకుని
అనర్గళంగా మాట్లాడగలిగిన ప్రతిభావంతుడు
బహుభాషాకోవిదుడు పీవీ నరసింహారావు

కాకతీయపత్రిక నడిపి విశ్వనాథవారి నవలను
సహస్రఫణ్ గా హిందీలో అనువదించిన సాహితీవేత్త
సహస్ర చంద్రోదయాలు చూసిన పరిపూర్ణుడు పివి

మనలో పోరాటశక్తి లేకపోతే జీవితమే లేదనీ
భూపరిమితి చట్టంతో ప్రభుత్వానికి భూమినిచ్చాడు 
సంస్కరణలతో దేశాన్ని కదం తొక్కించినవాడు పివి

దేశం నీకేమిచ్చిందని కాక దేశానికి నీవేం చేశావన్న
జాన్ కెనడి వ్యాఖ్యలు ప్రామాణికంగా తీసుకొన్నాడు
భారతావని రుణం తీర్చుకున్న ధన్యజీవి పివి

..........................................................................................................     
పీవీ మొగ్గలు
 కె.సువర్ణాదేవి