పురిటినొప్పులు

 
పురిటినొప్పులు_harshanews.com
పురిటినొప్పులు 
అందాల కలల లోకంలో
ఆదమరిచి విహరించిన ఆ మనసు..!
ఆనందాల బృందావనమయ్యే
అపురూప క్షణాలు..!

ఉదరపు కుఢ్యాలను తడుముతున్న
ఆ వెచ్చని పాదాలు..!
వెన్నులో నుండి పుట్టుకొచ్చిన
నాడులు నాట్యాలు..!

భరించలేని బాధల సుడుల్లో
తనువు పుండైన తరంగాలు..!
ఉమ్మనీటి సెలయేరులో
స్వేచ్చగా ఈదురున్న ఆ వారసుని రాకకు సూచికతో..
దిక్కులు పిక్కటిల్లేలా సంతోషపు కేకలు..!

ఒకవైపు కండరాలన్ని బరువెక్కి
ఎముకలన్నీ విచ్చుకోగా
ఆ...ఊపిరాడని క్షణాల్లో
మరణవేదికపై తల్లిగా ఓ..పునర్జన్మ!

చీకటి ముసిరిన ఆ కళ్లల్లో దివ్యతేజస్సులు
పొత్తిళ్లలో బిడ్డను చూసిన మది ఆనందతాండవాలు..!
....................................................................................................


పురిటినొప్పులు_harshanews.com
అయిత అనిత
జగిత్యాల
89853 48424