నేడు ఎన్నారై గృహహింస కేసులపై వెబ్​నార్​ విచారణ

నేడు ఎన్నారై గృహహింస  కేసులపై వెబ్​నార్​ విచారణ
 అడిషనల్ డీజీపీ స్వాతిలక్రా
  • 101 కేసులు నమోదు
  • పాల్గొననున్న అడిషనల్ డీజీపీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి

హైదరాబాద్​:  పెళ్లి పేరుతో ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న ఈ  ఎన్ఆర్ఐ పెండ్లికొడుకులను ఏమీ చేయలేక కుమిలిపోయే తల్లిదండ్రులకు ఊరట కలిగిస్తోంది తెలంగాణ ఉమెన్ సేప్టీ వింగ్. గత ఏడాది జూలై 17న ఏర్పడిన  ఎన్నారై వింగ్ గత కొన్ని ఏండ్ల నుంచి  పెండింగ్ లో ఉన్న ఎన్నారై కేసులను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకుగాను  అడిషనల్ డిజిపి, ఐపిఎస్ అధికారి స్వాతిలక్రా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఎన్ఆర్ఐ ఫిర్యాదులపై న్యాయసూచనలు తీసుకుంటూ విదేశీ వ్యవహారాల శాఖ, రాయబారి కార్యాలయాల అధికారులతో, ఎన్జీవోల సహాయంతో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 30న  వెబినార్ ద్వారా ఎన్ఆర్ఐ కేసులను విచారిస్తున్నారు.  ఈనెల 30న నిర్వహించే ఈ వెబినార్ లో ఎన్‌ఆర్‌ఐ సెల్, ఉమెన్ సేఫ్టీ వింగ్ వద్ద నమోదు అయిన 101  పిటిషన్ దారులు పాల్గొంటారు. అడిషనల్ డీజీపీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి, ఎన్ఆర్ఐ విభాగం జిఏడి చిట్టిబాబు, ఎసిపిలు అపర్ణ, డానియల్, లీగల్ అడ్వరైజర్లు,ఎన్జీవోలు దాదాపు 45మంది ఎస్ఐ, సిఐలు, 80మందికి పైగా బాధితులు ఈ వెబినార్ లో పాల్గొంటారు.