దినసరి కూలీలకు నిత్యావసర సరుకుల పంపిణీ


  • 100 మందికి అందజేత
  • హెచ్​ఈఎస్​ సొసైటీ సేవాభావం

దినసరి కూలీలకు నిత్యావసర సరుకుల పంపిణీ_harshanews.com
కూలీలకు నిత్యావసర సరుకులను అందజేస్తున్న సొసైటీ సభ్యులు

హైదరాబాద్​: సమాజంలోని పేద వర్గాలవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కొంత ఉపశమనాన్ని అందించాలనే లక్ష్యంతో హెచ్​ఈఎస్​ సొసైటీ సేవా భావాన్ని చూపింది. నాచారం శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 100 మంది దినసరి కూలీలకు నిత్యావసర సరుకులను అందజేసింది. ఈ సందర్భంగా హెచ్​ఈఎస్​ సొసైటీ సభ్యులు రమణ కోవెలమూడి మాట్లాడుతూ..  దినసరి కూలీలు పని చేయకపోతే వారి కుటుంబసభ్యులు పస్తులుండే పరిస్థితి నెలకొందన్నారు. లాక్​డౌన్​ కారణంగా ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వారి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని సుమారు 100 మంది దినసరి కూలీలకు నిత్యావసర వస్తువులు అందజేశామని తెలిపారు. సొసైటీ తరుపున మరింత మందికి సరుకులు అందజేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. మా సొసైటీ లక్ష్యం కూలీలు పస్తులుండకుండా ఉండడమేనని తెలిపారు.