స్వదేశీ.. స్వదేశీ..

MAKE IN INDIA_harshanews.com
స్వదేశీ.. స్వదేశీ..

స్వదేశీ.. స్వదేశీ...
నేడు అందరి నోటా స్వదేశీ
స్వదేశీ అంటే స్వయం  సమృద్ది !
అదే మన జాతి అభివృద్ధి !!

స్వదేశీ.. స్వదేశీ...
నేడు అందరి నోటా స్వదేశీ
స్వదేశీ ఉద్యమానికి నాంది 
నాటి బెంగాల్ విభజన !
మరి నేటి ఉద్యమానికి 
ఎందుకింకా తర్జనభర్జన !!

స్వదేశీ.. స్వదేశీ...
నేడు అందరి నోటా స్వదేశీ
 చేయాలి చైనా వస్తు బహిష్కరణ !
 ఇక రావాలి నూతన ఆలోచనల ఆవిష్కరణ !!

స్వదేశీ.. స్వదేశీ...
నేడు అందరి నోటా స్వదేశీ
పటిష్టం చేద్దాం మన ఆర్థిక వ్యవస్థని !
తొలగిద్దాం ఋణగ్రస్త భారత్ అవస్థని !!

స్వదేశీ.. స్వదేశీ...
నేడు అందరి నోటా స్వదేశీ
మన వాణిజ్య రంగమే 
చైనాకు ఆయువు పట్టు !
కదిలించినదది 
మన ఆత్మాభిమానమనే తేనె తెట్టు !!

స్వదేశీ.. స్వదేశీ...
నేడు అందరి నోటా స్వదేశీ      
ఇండియా అవ్వాలి ఆర్థిక పరిపుష్టం !
పట్టుదలుంటే  కాదేమంత కష్టం !!

స్వదేశీ.. స్వదేశీ...
నేడు అందరి నోటా స్వదేశీ
విదేశీ మోజుతో తరలిపోతున్న 
మన మేధో సంపద !
నిలువరిస్తే ఇక వారే 
మన జాతి సంపద !!

స్వదేశీ.. స్వదేశీ...
నేడు అందరి నోటా స్వదేశీ
భారతీయతను గేలి చేయుట 
మనలో కొందరి రివాజు !
వారి భారతీయతను వేయాలా  ఇక బేరీజు !!

స్వదేశీ.. స్వదేశీ...
నేడు అందరి నోటా స్వదేశీ
సంక్లిష్ట ప్రపంచ వాణిజ్య విధానాలు !
సంపూర్ణ విదేశీ వస్తు బహిష్కరణ కు బంధనాలు !!

స్వదేశీ.. స్వదేశీ...
నేడు అందరి నోటా స్వదేశీ
మేక్ ఇన్ ఇండియా 
మన స్వావలంబన కిచ్చిన పిలుపు !
స్వీయాభివృద్ధి సాధిస్తే 
ప్రపంచమే తట్టునిక మన తలుపు !!
..............................................................................................................
MAKE IN INDIA_harshanews.com
 వోరుగంటి శ్రీ వెంకటేష్ బాబు
 ఎం.ఏ., ఎం.ఫిల్., ( పి.హెచ్ డి )
 ఖమ్మం.
 98497 40116