‘ఆడ’ పిల్ల

‘ఆడ’ పిల్ల
‘ఆడ’ పిల్ల


ఆడపిల్లనన్నారు .... దించిన తలెత్తకూడదన్నారు ... ఎవడైనా ఏడిపించినా కిమ్మనకూడదన్నారు ప్రేమిస్తే ఒప్పుకోవాలన్నారు అఘాయిత్యాలు చేస్తే సహకరించాలన్నారు ఆ...డపిల్లననేమో… తెచ్చిన సంబంధం చేసుకోవాలన్నారు అత్తింట అదుపాజ్ఞల్లో ఉండాలన్నారు ఆరళ్ళు పెట్టినా నోరెత్తకూడదన్నారు తిట్టినా కొట్టినా పడుండాలన్నారు ఆత్మాభిమానం ఉండకూడదన్నారు ఆ...డపిల్లనే అనే కదా వంటింటికంకితం చేస్తే పడున్నా ముద్దు ముచ్చట తీర్చకున్నా మిన్నకున్నా తిండి పెట్టకపోతే నీళ్ళు తాగి పడుకున్నా నెలంతా కష్టపడితే వచ్చిన జీతం అప్పనంగా మామగారు లాక్కుంటే ఊరుకున్నా ఈడ పిల్లనే ….కదా అని ఇంత చేసినా
ఒక్కసారి ఒకే ఒక్కసారి ఒళ్ళుమండి మనసు మండి
ఎదురు తిరిగితే ... బరితెగించిందన్నారు....
సంప్రదాయాల్లేనిదన్నారు కష్టమొచ్చి కన్నీరు పెడితే
ఏడుపుగొట్ట్తుదన్నారు మా ఇంట్లో వద్దు పుట్తింటికి పో అన్నారు అందుకేనేమో అక్కడా ...
ఇక్కడా ...నేను "ఆడ.... పిల్లనే“ ఎవరికీ సొంతం కాక
"ఈడ పిల్ల" నై మనలేక వెళ్ళిపోతున్నా ....
అందర్నీ కన్న
కర్మభూమిలోకి అందరికడ ....
ఆనందమయ శలవు తీసుకుంటూనే...
..................................................................


‘ఆడ’ పిల్ల
పద్మ కుమారి పి.
హైదరాబాద్​