తెలుగు వీరా...జోహార్లు

telugu veera joharlu_harshanews.com
తెలుగు వీరా...జోహార్లు

      భారత మాత గర్వించదగిన బిడ్డగా
      భారత్ మాతాకి జై..అంటూ
      బోసినవ్వుల సంతోషాలతో
      మంజులమ్మ ఒడిలో పెరిగి
      సరస్వతీదేవి బడిలో చదివి
      భారతీ దేవి సేవకు ఒదిగి
      మేరా భారత్ మహాన్..అంటూ
      సంతోషంతో ఒరిగి పోయావా...

     భారతీయులకు సైనికుడిగా
     మాతృమూర్తులకు తనయుడిగా
     ప్రేమానుబంధాలకు సోదరుడిగా
     ఆత్మీయులకు ఆత్మబంధువుగా
     ప్రియమైన పతిదేవుడిగా...
     పసి బాలురకు జనకుడిగా...

     భారతమాత అడుగుజాడలలో
    నా జన్మభూమి అందమైన దేశమని
    జై జవాన్...జై కిసాన్..అంటూ
    కీచకవధుల...దుష్టశక్తుల
    దిష్టి చూపులను మంత్రించి
    సస్యశ్యామలం మా తరం అంటూ..
    తర తరాలు నీకు నేను అంకితమమ్మా అని
 
     నీ గెలుపుకి నేను శిరస్సు వంచి
     ఓడిపోతాను తల్లీ..అంటూ
    మా తెలుగు తల్లికి ముద్దు బిడ్డగా
    సంతోషంగా నీ మెడలో పూమాలగా
     నిత్యం "వందేమాతరం" అని
     స్మరిస్తానని మాట ఇచ్చాడు తల్లీ..
     
                    జై హింద్

           "కల్నల్" సంతోషన్నకు....ఆశయాల అశ్రు నివాళి.
.........................................................................................................


telugu veera joharlu_harshanews.com
నాట్యమయూరి టి.వి.శిరీష,
హైదరాబాద్​.
96184 94909