నింగి

 నింగి
 నింగి

అమ్మ అవనియంత
ఆత్మీయత
అండపిండ బ్రహ్మాండం అమ్మ
నిజమే..
భూ మాతగా నిల్చిన
అమ్మ–చూపు
నింగివైపే..
ఆమె కళ్ళల్లో చెరగని చిత్రం
నాన్నే..
ఏమేయ్​ అన్న పిలుపు
క్షణంక్షణం ఆమెను కరిగించే
హిమాన్ని చేస్తుంది..

పిండమై.. అణువును పాపగా
మార్చే నవమాసాలు..
ఆమె పొట్ట చుట్టే నాన్న
 ఆనవాల్లు..
పుట్టిన బిడ్డను తన చేతుల్లో
నిల్పిన ఆమె ఊసులు..
నాన్న కళ్ళల్లో పువ్వులై పూస్తాయి..
నవ్వులై విరుస్తాయి..

ప్రొద్దుప్రొద్దు ఉదయసూరూడై..
రెక్కల్ని సారిస్తూ తపించే నాన్న..
విరిసే కిరణం, కురిసే వాన, చూపే మార్గం,
నడిచే గమ్యం..

అవని అంత అమ్మకు ఆత్మ నాన్న..
కన్ను విప్పిన పసిగుడ్డుకు చిరునామా నాన్న..
జీవన రహదారిలో.. రేపటి భవితకు సంకేతం నాన్న..
కుటుంబ క్షేమపు కార్డుకు
శుభం గీతం రాసే నాన్న..
చెమట చుక్కల్ని మింగే నీలకంఠుడు
అమృతాన్ని పంచే దేవుడు నాన్న..
...............................................................


 నింగి
డాక్టర్ బండారు సుజాతశేఖర్ 
 హైదరాబాద్​
 98664 26640